మలయాళంలో సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ.. రెండు సూపర్ ప్రాజెక్టులపై సస్పెన్స్
మలయాళంలో రెండు భారీ సీక్వెల్ ప్రాజెక్టులు సినీ ప్రేమికుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. వాటిలో దృశ్యం ఫైనల్ చాప్టర్ చిత్రీకరణ పూర్తవ్వగా, లోకా సీక్వెల్ పనులు వేగవంతమయ్యాయి. నటి కళ్యాణి ప్రియదర్శన్ లోకా సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర హింట్ ఇచ్చారు. దృశ్యం ఫైనల్ చాప్టర్ లో ఊహించని మలుపులు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
మలయాళ సినిమా ఇండస్ట్రీలో రెండు సూపర్ ప్రాజెక్టుల సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ నెలకొంది. వాటిలో ఒకటి దృశ్యం ఫైనల్ చాప్టర్ కాగా, మరొకటి లోకా సీక్వెల్. ఈ రెండు చిత్రాలు మలయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో లోకా చాప్టర్ వన్ చంద్ర ఒకటి. ఈ చిత్రంలో చంద్ర పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. లోకా సీక్వెల్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఓనం పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. కళ్యాణి ప్రియదర్శన్ స్వయంగా చంద్ర పాత్రను మళ్ళీ చూసేందుకు సిద్ధంగా ఉండమని హింట్ ఇచ్చారు. మొదటి భాగం కంటే సెకండ్ చాప్టర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు
Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ
Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్
Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్