Vijay sethupathi: మాట మార్చిన సేతుపతి.. మళ్లీ పాత రూట్లో ట్రావెల్‌

Edited By:

Updated on: Nov 27, 2025 | 6:04 PM

విజయ్ సేతుపతి విలన్ పాత్రలకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు, ఇది గతంలో హీరోగా మాత్రమే చేస్తానన్న తన ప్రకటనకు విరుద్ధం. 'మాస్టర్', 'విక్రమ్', 'ఉప్పెన' వంటి చిత్రాలలో ఆయన విలనిజానికి పేరుపొందారు. సింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరసన్' (తెలుగులో 'సామ్రాజ్యం')లో ఆయన మళ్లీ విలన్ గా నటిస్తున్నారు. బలమైన స్క్రిప్టులు వస్తే విలన్ రోల్స్ చేస్తానని సేతుపతి తెలిపారు.

హీరోగా నటించడంలో కిక్‌ ఉంటుందో లేదోగానీ, విలన్‌గా చేయడంలో మాత్రం అదో రకమైన కిక్‌ని ఫీలవుతారు ఆర్టిస్టులు. ఆ మజా తెలుసుకాబట్టే మళ్లీ అలాంటి రోల్‌ని సెలక్ట్ చేసుకున్నారు సేతుపతి అంటోంది కోలీవుడ్‌. నేను హీరోగా తప్ప ఇంకే సినిమాలూ చేయను అని ఆ మధ్య గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు విజయ్‌ సేతుపతి. అలాంటిది ఇప్పుడు సడన్‌గా విలనీగా చేస్తానని అనౌన్స్ మెంట్‌ ఇచ్చేశారు. దీంతో ఆయన విలన్‌గా చేసిన పాత సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు జనాలు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద విలనిజానికి కొత్త అర్థం చెప్పిన వాళ్లల్లో విజయ్‌ సేతుపతి పేరును మర్చిపోలేం. మాస్టర్‌, విక్రమ్‌, ఉప్పెన.. ఏ సినిమా తీసుకున్నా ఆయన తనదైన స్టైల్‌ని ఎలివేట్‌ చేశారని అంటుంటారు విమర్శకులు. ఈ మధ్య కంప్లీట్‌గా హీరోగానే చేయాలని ఫిక్సయ్యారు సేతుపతి. అందుకే కొన్నాళ్ల పాటు గ్యాప్‌ ఇచ్చారు. అయితే, ఇప్పుడు కాస్త మనసు మార్చుకున్నట్టు అర్థమవుతోంది. హీరోగా కంటిన్యూ అవుతూనే, వదులుకోకూడనంతగా మెప్పించే స్క్రిప్టులు వచ్చినప్పుడు విలనీ చేయడానికి సిద్ధమవుతున్నారు. శింబు హీరోగా నటిస్తున్న అరసన్‌లో నటిస్తున్నారు సేతుపతి. తెలుగులో సామ్రాజ్యం పేరుతో రిలీజ్‌ కానుందీ మూవీ. వడచెన్నై యూనివర్శ్‌లో భాగంగా వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ శింబుతో కలిసి మణిరత్నం నవాబులో నటించారు సేతుపతి. ఇప్పుడు ఈ కాంబో మరోసారి స్క్రీన్స్ మీదకు రావడం ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..