Nayanthara – Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘అన్నపూరిణి’ అవుట్.! క్లారిటీ వీడియో..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. దక్షిణాది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోనూ పాగా వేసేసింది. రీసెంట్‌గా.. షారుక్ జవాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కమర్షియల్ చిత్రాలే కాదు..కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు కూడా... చేసే నయన్.. ఇటీవల 'అన్నపూరణి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కంటెంట్ విషయంలో వివాదాలు ఎదురైనా కూడా థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా రెండు మూడు రోజు క్రితం నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ..
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. దక్షిణాది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోనూ పాగా వేసేసింది. రీసెంట్‌గా.. షారుక్ జవాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కమర్షియల్ చిత్రాలే కాదు..కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు కూడా… చేసే నయన్.. ఇటీవల ‘అన్నపూరణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కంటెంట్ విషయంలో వివాదాలు ఎదురైనా కూడా థియేటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా రెండు మూడు రోజు క్రితం నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టుకుంది. ట్రెండింగ్‌లోకి వెళ్లింది. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ.. అంతలోనే.. ఆ ఓటీటీలో కనిపించకుండా పోయింది. ఇక ఈ సినిమా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా, లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని.. నిర్మాతలతోపాటు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను ఆశ్రయించాడు మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి. అలాగే ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా అభ్యర్థించారు.
ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ పరిషత్ కు క్షమాపణలు చెబుతూ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ అలియాస్ అచ్యుత్ కుమార్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి అలియాస్ నయనతారకు చెఫ్ కావాలని కోరిక ఉంటుంది. బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నాన్ వెజ్ ముట్టుకోవద్దని అంటారు. మరి అలాంటి నింబధనల మధ్య అన్నపూరణి చెఫ్ అయ్యిందా ?. ఎలాంటి సవాళ్లను, పరిస్థితులను ఎదుర్కోంది అనేదే ఈ సినిమా.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos