Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ టార్గెట్‌ ఏంటి?

Edited By:

Updated on: Oct 30, 2026 | 7:10 PM

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. మరో పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మహేష్‌ ఎవరితో పనిచేస్తారనే చర్చ మొదలైంది. సందీప్‌ రెడ్డి వంగా, ప్రశాంత్‌ నీల్‌, బుచ్చిబాబు సనా పేర్లు వినిపిస్తున్నా, ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌నూ మహేష్‌ అధికారికంగా ప్రకటించలేదు. హాలీవుడ్‌ అవకాశాలపైనా ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. జస్ట్‌ పది రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉండటంతో సూపర్ ష్టార్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఈ మెగా ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ రేంజ్‌లో భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ‘వారణాసి’ కోసం రెండేళ్ల టైమ్‌ కేటాయించారు మహేష్ బాబు. ప్రజెంట్‌ ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. కేవలం పది రోజుల బ్యాలెన్స్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉండటంతో, త్వరలోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాబోతోంది. దీంతో జక్కన్న సినిమా తర్వాత సూపర్‌స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో మొదలైంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా నెక్ట్స్ మూవీని సెలెక్ట్ చేసుకోవడం పెద్ద సవాలే. ఆ రేంజ్ హైప్‌ను, మార్కెట్‌ను బ్యాలెన్స్ చేసేలా మహేష్ కోసం సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు లాంటి క్రేజీ డైరెక్టర్ల పేర్లు లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే మహేష్‌తో చర్చలు జరిపారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మహేష్ మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా లాక్ చేయలేదు. ‘వారణాసి’ మూవీతో గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే గ్లోబల్ రెస్పాన్స్‌ను బట్టి తన నెక్ట్స్ మూవీ జానర్, స్కేల్ డిసైడ్ చేయాలని భావిస్తున్నారట మహేష్. మరోవైపు నేరుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసే ఆలోచనలో కూడా మహేష్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి మహేష్ ఏ నిర్ణయం తీసకుంటారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..

Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ

Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us