Shweta Basu: గుర్తుపట్టలేనట్టుగా మారిపోయి.. షాక్ షాకిస్తున్న హీరోయిన్.!

|

Apr 30, 2024 | 11:32 AM

ఎ..క్క..డా.. అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. చక్కటి రూపం.. కలువ కన్నులతో బిగ్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజీ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగమ్మాయిగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది శ్వేత బసు ప్రసాద్. యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత.

ఎ..క్క..డా.. అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. చక్కటి రూపం.. కలువ కన్నులతో బిగ్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజీ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగమ్మాయిగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది శ్వేత బసు ప్రసాద్. యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత. మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమయ్యింది. దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.

పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శ్వేత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. దీంతో అటు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.