కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు

Updated on: May 11, 2026 | 3:49 PM

విజయ్ రాజకీయ ప్రవేశం, అజిత్ సినిమాల వేగం తగ్గించడంతో కోలీవుడ్‌లో పెద్ద శూన్యం ఏర్పడింది. ఈ దళపతి, అజిత్ స్థానాన్ని భర్తీ చేసే యువ హీరోలు ఎవరు అనే చర్చ జరుగుతోంది. సూర్య, విక్రమ్ వంటి వారు ప్రయోగాత్మక చిత్రాలతో తడబడుతుంటే, ధనుష్, శివకార్తికేయన్ నిలకడ లేని ప్రదర్శన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సీనియర్లు బాక్సాఫీస్ గౌరవాన్ని కాపాడేందుకు ముందుకొస్తున్నారు.

హూ ఈజ్‌ నెక్స్ట్ దళపతి..? ఈ ప్రశ్న తమిళనాట వినిపిస్తుందో లేదో గానీ, అదర్‌ వుడ్స్ లో యమా స్పీడ్‌లో చర్చల్లో నిలుస్తోంది. సీఎం కుర్చీకి విజయ్‌ ఇంకెంత చేరువలో ఉన్నారనే డిస్కషన్‌కి కొనసాగింపుగా.. కోలీవుడ్‌లో విజయ్‌ స్థానాన్ని భర్తీ చేసే హీరో ఎవరనే చర్చ జరుగుతోంది. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక తరం స్టార్ హీరోలు రిటైర్ అవుతున్నా… సినిమాల వేగం తగ్గిస్తున్నా… వారి స్థానాన్ని తదుపరి తరం యువ హీరోలు భర్తీ చేయడం సహజం. తమిళనాట కూడా ఈ పరిస్థితులే ఉన్నాయా? యువహీరోలు సన్నద్ధంగా ఉన్నారా? చెయిర్‌లో కూర్చోవడానికి అన్ని విధాలా అర్హతలను సంపాదించుకున్నారా? లేకుంటే సీనియర్లే ఇంకొన్నాళ్లు పరిశ్రమ ప్రతిష్టను కాపాడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారా? కోలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ కుర్చీ ఎవరికి సొంతం? దళపతిగా సిల్వర్‌స్క్రీన్‌ని ఏలేదెవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఒకప్పుడు కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలిన మాస్ క్రౌడ్ పుల్లర్స్ ఇప్పుడు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. విజయ్‌కి దీటుగా ఇమేజ్‌ ఉన్న అజిత్ కుమార్ ఎక్కువ సమయాన్ని బైక్‌ రేసింగులకే వెచ్చిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టే ఈ ఇద్దరు టాప్ స్టార్స్ యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కోలీవుడ్‌లో ఒక పెద్ద వేక్యూమ్‌ ఏర్పడుతుందన్నది విశ్లేషకుల మాట. రజనీ – కమల్‌ తర్వాత ఆ రేంజ్‌ హీరోలుగా విజయ్‌ – అజిత్‌ నిలదొక్కుకున్నారు. మరి వీరి తర్వాత మాస్‌ ఆడియన్స్ ని మెప్పించే క్రేజ్‌ని సొంతం చేసుకునేదెవరు? ఈ ప్రశ్నకి ఇన్‌స్టంట్‌ ఆన్సర్‌ సూర్య అండ్‌ విక్రమ్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో శివపుత్రుడు లాంటి సినిమాను కలిసి చేసిన వీరిద్దరు ఆ తర్వాత ఎవరికి వారు మంచి హీరోలుగానే ఎదిగారు. కానీ, సెలక్ట్ చేసుకుంటున్న కథలను బాక్సాఫీస్‌ దగ్గర కాసులుగా మార్చడంలో ఎక్కడో ఫెయిల్‌ అవుతున్నారు. చాలా వరకు వీరు చేస్తున్న ప్రయోగాత్మక చిత్రాలు వికటిస్తున్నాయి. లేకుంటే జనాల మెప్పు పొందడం లేదు. విషయం ఏదైనా ఉన్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడంలో ఓ రకంగా ఇద్దరూ వెనకబడ్డారన్నది వాస్తవం. మరి ధనుష్‌, శివకార్తికేయన్‌ సంగతేంటి అనేవారున్నారు. ధనుష్‌ ఓ వైపు నటన, మరోవైపు యాక్టింగ్‌, ఇంకో వైపు అదర్‌ ఇండస్ట్రీ మూవీస్‌ అంటూ అటూ ఇటూ షఫిల్‌ అవుతున్నారు. శివకార్తికేయన్‌ ఒక సినిమాతో సూపర్‌ అనిపించుకుంటే, ఆ వెంటనే ఫ్లాపులతో సతమతమవుతున్నారు. జయం రవి, విశాల్‌ తరహా హీరోలను ఈ రేస్‌లో కన్సిడర్‌ చేయడం లేదు మార్కెట్‌ విశ్లేషకులు. యువతరం తడబడుతున్న వేళ, కోలీవుడ్ బాక్సాఫీస్ గౌరవాన్ని కాపాడేందుకు దిగ్గజ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగారు. వయసుతో సంబంధం లేకుండా ఈ ఇద్దరు సీనియర్లు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. గత ఏడాది కాలంగా బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమా జోష్ తగ్గకుండా చూసుకుంటున్నది వీరే కావడం విశేషం. అంతేకాదు, కొన్ని దశాబ్దాల తర్వాత కమల్ – రజనీ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నారు. వీరు చేస్తున్న ప్రాజెక్టులన్నీ హిట్‌ అయితే, వీరికి తిరుగుండదు. మరి తమవంతుగా ట్రై చేస్తున్న ఈ సీనియర్ల అండతో కోలీవుడ్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

Follow Us