Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

Updated on: Jun 07, 2026 | 4:29 PM

‘కేజీఎఫ్’ హీరో యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్ మహారాష్ట్రలోని అలీబాగ్‌లో రూ.24 కోట్ల విలువైన ప్రీమియం బీచ్‌ఫ్రంట్ భూమిని కొనుగోలు చేశారు. కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న 1.3 ఎకరాల విస్తీర్ణం గల ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ ఇటీవల పూర్తయింది. ఇప్పటికే బాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల ఫేవరెట్ డెస్టినేషన్‌గా పేరుగాంచిన అలీబాగ్‌లో ఇప్పుడు యశ్ దంపతులు కూడా పెట్టుబడి పెట్టడం చర్చనీయాంశమైంది.

‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టించిన కన్నడ సూపర్ స్టార్ యశ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. ‘ బాలీవుడ్ సెలబ్రిటీలకి, కోటీశ్వరుల ఫేవరెట్‌ లగ్జరీ సెకండ్-హోమ్ డెస్టినేషన్ గా పేరున్న మహారాష్ట్రలోని అలీబాగ్‌లో యశ్, ఆయన సతీమణి రాధికా పండిట్ ఒక ప్రీమియం బీచ్ ఫ్రంట్ ల్యాండ్‌ను కొన్నారు. ఆ డీల్ విలువ అక్షరాలా రూ. 24 కోట్లు అని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘లియాసెస్ ఫోరాస్’ సేకరించిన అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ మే 18న అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్‌ తాలూకాలోని కామత్ గ్రామంలో సుమారు 1.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు వ్యవసాయ భూములను యశ్ దంపతులు కొనుగోలు చేశారు. కిహిమ్ బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ ఆస్తికి పశ్చిమాన సముద్రం, తూర్పున గ్రామ రహదారి ఉన్నాయి. ఈ ఒప్పందం కోసం యశ్ దంపతులు రూ. 1.44 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 60,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ఈ జంట, తమ అటార్నీ ద్వారా ఈ లావాదేవీని పూర్తి చేశారు. నసీమ్ ఇక్బాల్ హలీమ్, ఇఫత్ షఫీక్ అహ్మదీ అనే వ్యక్తుల నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్టు పత్రాల్లో నమోదైంది. అలీబాగ్‌ ఇప్పటికే బాలీవుడ్, క్రికెట్ తారలకు వీకెండ్ హోమ్‌గా మారింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్, సుహానా ఖాన్ వంటి ప్రముఖులు ఇక్కడ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన యశ్ దంపతులు కూడా చేరడంతో అలీబాగ్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Buchi Babu: జాన్వీని రోల్ పై విర్శలు.. వివరణ ఇచ్చిన బుచ్చి

హస్కీ వాయిస్‌తో తియ్యగా మాట్లాడి.. కోట్లలో ముంచేసిందిగా

హీరోయిన్ కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ వారసురాలు రాఘవి

Follow Us