బ్రేక్ కోసం కన్నడ బ్యూటీస్ వెయిటింగ్

Edited By:

Updated on: Oct 30, 2026 | 6:34 PM

అనుష్క శెట్టి, రష్మిక మందన్న తర్వాత టాలీవుడ్‌లో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుందా అనే చర్చ మొదలైంది. పూజా హెగ్డే, శ్రీనిధి శెట్టి, ఆషికా రంగనాథ్‌, రుక్మిణీ వసంత్‌ వంటి భామలు తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నా, ఆశించిన స్థాయిలో స్టార్‌ స్టేటస్‌ దక్కించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రుక్మిణీ వసంత్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో కన్నడ భామల హవా చాలా కాలంగా కొనసాగుతోంది. ఒకప్పుడు అనుష్క శెట్టి, ఆ తర్వాత రష్మిక మందన్న తెలుగు ఇండస్ట్రీని ఏ రేంజ్‌లో రూల్ చేశారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే చందన సీమ నుంచి వచ్చిన యంగ్ బ్యూటీస్ మాత్రం ఆ రేంజ్‌లో జోరు చూపించలేకపోతున్నారు. వరుస అవకాశాలు వస్తు్న్నా.. బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. కన్నడ సీమ నుంచి వచ్చి టాలీవుడ్‌లో జెండా పాతిన హీరోయిన్ల లిస్ట్ తీస్తే అనుష్క, రష్మిక పేర్లు టాప్‌లో ఉంటాయి. వీళ్ల బాటలోనే కర్ణాటక మూలాలున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. కానీ ఆ తర్వాత వచ్చిన వరుస ఫ్లాపులతో పూజా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఈ భామ కెరీర్ కాస్త స్లో అయ్యింది. మరోవైపు అమిగోస్, నా సామిరంగ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆషికా రంగనాథ్.. గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసినా, స్టార్ లీగ్‌లోకి తీసుకెళ్లే ఒక్క భారీ హిట్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సప్త సాగరాలు దాటి సినిమాతో యూత్ క్రష్‌గా మారిన రుక్మిణీ వసంత్‌కు కూడా టాలీవుడ్‌లో ఆశించిన స్టార్ట్ దక్కలేదు. నిఖిల్‌తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిరాశపరచడంతో, ఇప్పుడు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో తన లక్ పరీక్షించుకోబోతున్నారు. టాలెంట్, గ్లామర్ పుష్కలంగా ఉన్నా లక్ కలిసిరాని ఈ కన్నడ బ్యూటీస్.. అనుష్క, రష్మికల స్థాయిలో ఇండస్ట్రీని ఎప్పుడు రూల్ చేస్తారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..

Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ

Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us