Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!

|

Oct 16, 2024 | 9:32 PM

ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి ఈ సినిమాతో కొరటాల శివతో జత కట్టాడు తారక్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు దేవర సినిమా రూ. 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోన్న దేవర ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బజ్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి ఎన్టీఆర్ దేవర సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఒకేసారి ఎన్టీఆర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రెండూ కలిపి రాత్రిపూట తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??

హీరో వయసు 39.. ఈ జోడీ మధ్య వయసు తేడా.. చాలానే ఉందిగా..

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ బిగ్ బాస్‌‌‌కు ఎందుకు గుడ్ బై చెప్పాడు ??

తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం

Follow us on