Jayam Ravi – Aarti: నాకు నా భర్తే కావాలి.! ఆర్తి డేరింగ్ పోస్ట్.. వీడియో వైరల్.

|

Oct 02, 2024 | 9:53 AM

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ లవబుల్ కపుల్స్‎గా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న జంట జయం రవి, ఆర్తి. కానీ ఇప్పుడు వీరిద్దరి విడాకుల వ్యవహారమే సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారని తెలియడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాకయ్యారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని జయం రవి పోస్ట్ చేయగా..

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ లవబుల్ కపుల్స్‎గా ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న జంట జయం రవి, ఆర్తి. కానీ ఇప్పుడు వీరిద్దరి విడాకుల వ్యవహారమే సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారని తెలియడంతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాకయ్యారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని జయం రవి పోస్ట్ చేయగా.. తన అనుమతి లేకుండానే డివోర్స్ ప్రకటన చేశారని.. తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని సుదీర్ఘ పోస్ట్ చేశారు ఆర్తి. ఆ తర్వాత ప్రముఖ సింగర్ తో రిలేషన్ షిప్ అంటూ జయం రవి గురించి కొన్ని వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. తనపై వచ్చిన వార్తలు అవాస్తవమి.. అలాగే విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని.. తన ఇంట్లో ఉన్న వస్తువులను తిరిగి తనకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు జయం రవి. ఇలా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా.. గత కొన్ని రోజులుగా వార్ జరుగుతోంది. ఇక ఈక్రమంలోనే తాజాగా తన గురించి వస్తున్న అసత్య ఆరోపణలపై గట్టిగానే రియాక్ట్ అయ్యింది ఆర్తి.

జయం రవి ఆస్తులు మొత్తం ఆర్తి చేతుల్లోనే ఉన్నాయని.. తన భర్తను ఇంటి నుంచి గెంటేసిందని.. దీంతో తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడని ఓ న్యూస్ ఆర్తికి వ్యతిరేకంగా నెట్టింట వైరలయ్యింది. ఈ క్రమంలోనే తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడనే టాక్ కూడా నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై నెట్టింట ఓ నోట్ షేర్ చేసింది ఆర్తి. ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదని.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లపై మండిపడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on