Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

Updated on: May 20, 2026 | 4:11 PM

Jayam Ravi వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. భార్య Aarti Raviతో విడాకుల వివాదం, Kenishaa Francisతో రిలేషన్ రూమర్లు, “చేతబడి చేశారు” అన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న రవి, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పడం అభిమానులను కలచివేసింది.

జయం రవి! ఇప్పుడీయన వార్త కాదు, ఒక స్టార్ హీరో వ్యక్తిగత జీవితం ఎలా సంక్షోభంలో పడిందో చెప్పే విషాదకరమైన ఘటనల సమాహారం. తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ జీవితం ఇప్పుడు ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు విడాకుల గొడవలు, మరోవైపు ప్రేమ వ్యవహారాలు, ఇంకోవైపు “చేతబడి చేశారు” అనే భయంకరమైన ఆరోపణలతో ఆయన పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కథ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది అంటే… జయం రవి, ఆయన భార్య ఆరతి మధ్య విభేదాలు ముదిరి కోర్టు మెట్లెక్కారు. అయితే ఇది సాదాసీదా విడాకుల కేసులా కాకుండా, ఒకరిపై ఒకరు బురద జల్లుకునే స్థాయికి వెళ్ళింది. ఆరతి తనను మానసికంగా హింసించిందని రవి ఆరోపిస్తుంటే, రవి మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరతి వర్గం ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే జయం రవి, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించినట్టుగా వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కట్ చేస్తే.. రీసెంట్‌గా కెనీషా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ జయం రవికి Breakup చెప్పినట్లు అనౌన్స్ చేసింది. “ఇక అతడు నీకే సొంతం” అంటూ పరోక్షంగా ఆరతిని ఉద్దేశించి కామెంట్ చేయడం కూడా చేసింది. ఇక మరోవైపు, ఆరతి గురించి కెనీషా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని మద్రాస్ హైకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కెనీషా ఏకంగా చెన్నై వదిలి వెళ్ళిపోయినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు తన జీవితంలోని ఓ “మూడ అక్షరాల” హీరోయిన్ ఎంటర్ అయిందని ఆమె వల్లే ఇదంతా అని మన హీరో వాపోతున్నాడు.అంతేకాదు ఇటీవల మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జయం రవి, తన కాపురంలో చిచ్చు పెట్టింది ఆ మూడక్షరాల “హీరోయిన్” అని బాంబు పేల్చారు. ఆమె పేరు నేరుగా చెప్పకపోయినా, తమిళ మీడియాలో ఆమెను “ఇడ్లీ నటి” లేదా “మూడు అక్షరాల నటి” అని కోడ్ లాంగ్వేజ్‌లో పిలుస్తున్నారట. ఆమె వల్లే తన కుటుంబం నాశనమైందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రకరకాల ఊహాగానాలు ఉన్నా, అధికారికంగా ఆ నటి పేరు బయటకు రాలేదు. ఇక మే 2026లో జరిగిన ప్రెస్ మీట్‌లో జయం రవి వెక్కి వెక్కి ఏడుస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తనపై అత్తమామల వైపు నుంచి చేతబడి ప్రయోగాలు జరిగిందని ఆయన ఆరోపించారు.దీనివల్ల తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, రక్తం వాంతులు చేసుకున్నానని మీడియా సాక్షిగా చెప్పడం అందరినీ కలచివేసింది. తాను ఎంత డిప్రెషన్‌లోకి వెళ్లానంటే, ఒకానొక దశలో చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆవేదన వ్యక్తం చేశారు. మానసికంగా తాను చనిపోయానని, ఇన్ని గొడవల మధ్య తాను నటించలేనని జయం రవి తెగేసి చెప్పారు. విడాకులు పూర్తిగా వచ్చి, ఈ సమస్యలన్నీ తీరే వరకు “సినిమాలు చేయను” అని ప్రకటించారు. జయం రవి పరిస్థితి చూస్తుంటే, ఇది కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, అతని కెరీర్‌ని దెబ్బతీసే స్థాయికి చేరినట్లు అర్థమవుతోంది. తాను బాధితుడినని, భార్య కుటుంబం తనను బానిసలా చూస్తోందని.. ఇప్పుడు తన పరువు తీస్తున్నారని జయం రవి వాదిస్తుంటే.. రవికి పరాయి స్త్రీల వ్యామోహం ఉందని.. అందుకే కుటుంబానికి దూరమయ్యాడనేది ఆరతి వాదన. వీరిద్దరి వాదన ఏమైనా కూడా.. మొత్తానికి, ఒక స్టార్ హీరో “చేతబడి”, “రక్తం వాంతులు” అంటూ పబ్లిక్‌గా ఏడ్వడం సినీ చరిత్రలో మాత్రం సంచలనంగా మారింది. అంతేకాదు ఈ వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా కూడా లేదు. ఇక ఇదంతా గమనిస్తున్న రవి ఫ్యాన్స్ మాత్రం.. సింపుల్‌గా పాపం అంటూ తమ విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి మరీ సింగర్‌ను చంపేసిన వ్యక్తి

Follow Us