Jayam Ravi: నెలకు 40 లక్షలు ఇవ్వాల్సిందే! భార్య డిమాండ్ విని.. షాక్‌లో స్టార్ హీరో!
తన విడాకుల వివాదంపై హీరో జయం రవి భావోద్వేగానికి గురయ్యాడు. భార్య ఆర్తి, ఆమె కుటుంబం తనను మానసికంగా వేధించారని, పిల్లలను కూడా కలవనివ్వడం లేదని ఆరోపించాడు. విడాకులు పూర్తయ్యే వరకు సినిమాలకు బ్రేక్ ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
జయం రవి .. ప్రస్తుతం ఈ పేరు వార్తల్లో తెగ వినిపిస్తోంది. మొన్నటి వరకు స్టార్ హీరోగా కొనసాగిన జయం రవి ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. జయం రవి, తన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, ఈ జంట విడిపోతున్నట్లు 2024 సెప్టెంబర్‌లో ప్రకటించారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగి, తీవ్ర ఆరోపణలతో ముదిరింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో జయం రవి మీడియా ముందు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు విడాకులు వచ్చే వరకు తాను సినిమాల్లో నటించనని, బ్రేక్ తీసుకుంటున్నానని జయం రవి తెగేసి చెప్పాడు. ఈ వివాదం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ, సైబర్ బుల్లీయింగ్ ఎదుర్కొంటున్నానని, అవి ఆగినప్పుడే మళ్లీ కెమెరా ముందుకు వస్తానని జయం రవి అన్నాడు. అలాగే తన భార్య ఆర్తి, ఆమె కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు రవి. పెళ్లయినప్పటి నుంచి తనను ఒక బానిసలా చూశారని, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయాడు. తనపై చేతబడి కూడా ప్రయోగించారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా యత్నించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు రవి. తన ఇద్దరు పిల్లలను తనతో కలవనివ్వడం లేదని, వారికి బాడీగార్డ్స్‌ను కాపలా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా జయం రవి భార్య ఆర్తి.. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.40 లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టును కోరినట్లు తెలుస్తుంది. అయితే దీని పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. జయం రవి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తారని, ఆయన రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఈ డిమాండ్ చాలా ఎక్కువని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రవి చేసిన ఆరోపణలపై ఆర్తి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు. నా మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు. నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..! భారీ యాక్షన్‌కు సిద్ధమైన మేకర్స్
Dragon: 4 నిమిషాల్లోనే సోషల్ మీడియా షేక్.. డ్రాగన్‌తో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
Peddi: ఉప్పెన ట్విస్ట్ కంటే పెద్దిలో 100 రెట్లు ట్విస్ట్! చరణ్ బిగ్ హింట్!
Ram Charan: పెద్ది సినిమా ఏమో కానీ.. నా కూతురిని ఎత్తుకోలేకపోతున్నా
