Prabhas: జపాన్‌కి ప్రయాణమవుతున్న ప్రభాస్‌.. ఇంతకీ మేటరేంటి ??

Edited By:

Updated on: Nov 22, 2025 | 1:58 PM

జపాన్ ఇప్పుడు భారతీయ సూపర్ స్టార్స్‌కు రెండో ఇల్లుగా మారింది. రజనీకాంత్ బాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు అక్కడ భారీ ఫాలోయింగ్‌ను పొందుతున్నారు. RRR సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత రాజమౌళి, హీరోలకు జపాన్‌లో ప్రత్యేక అభిమాన గణం ఏర్పడింది. టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను చురుగ్గా ప్రమోట్ చేస్తూ, అద్భుతమైన క్రేజ్‌ను చూరగొంటున్నారు.

జపాన్‌.. జపాన్‌.. జపాన్‌… జపాన్‌ని ఇప్పుడు ఇంటర్నేషనల్‌ విజిటర్స్ మాత్రమే కాదు, హీరోలు కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారనడం కన్నా సెకండ్‌ హోమ్‌లాగా ఫీలవుతున్నారు. ఒకప్పుడు రజనీ వేసిన బాటలో మన సూపర్‌స్టార్స్ అడుగులు వేస్తున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకు జపాన్‌లో వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. డైరక్టర్‌ రాజమౌళికి స్పెషల్‌ ఫ్యాన్స్ ఉన్నారక్కడ. జస్ట్ రాజమౌళికే కాదు, ఎన్టీఆర్‌కి, రామ్‌చరణ్‌కీ కూడా చాలా హ్యూజ్‌ ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ అయింది జపాన్‌లో. జపాన్‌లో దేవర పార్ట్ ఒన్‌ కోసం స్పెషల్‌ ప్రమోషన్లు చేశారు తారక్‌. అక్కడ ఎన్టీఆర్‌ హుక్‌స్టెప్‌ అంతగా ఫేమస్‌ అయింది. తారక్‌ మాత్రమే కాదు, జపాన్‌ ఫ్యాన్స్ కోసం రామ్‌చరణ్‌ కూడా స్పెషల్‌గా విజిట్‌ చేశారు. త్వరలో పెద్ది కోసం కూడా జపాన్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. త్వరలోనే ప్రభాస్‌ కూడా ది రాజాసాబ్‌ కోసం జపాన్‌ని విజిట్‌ చేయనున్నారు. ఇదివరకే వెళ్లాల్సిన ట్రిప్‌ పోస్ట్ పోన్‌ కావడంతో, ఈ సారి మాత్రం మిస్‌ కాకూడదని ఫిక్సవుతున్నారు. ఒకప్పుడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కే అంత ఫాలోయింగ్‌ ఉండేది. కానీ ఇప్పుడు మన స్టార్‌ హీరోలకు సాలిడ్‌ ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ అవుతోంది జపాన్‌లో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Premante Review: మనం అనుకున్నదొక్కటి.. చూపించింది ఇంకొకటి !! మూవీ రివ్యూ

మనం అనుకున్నదొక్కటి.. అక్కడ చూపించింది ఇంకొకటి!

పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది

ఉస్తాద్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!

ఆంధ్రాకింగ్‌ రామ్‌కి సక్సెస్‌ తెచ్చిపెడుతుందా ??