డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా జానీ మాస్టర్ సతీమణి

Updated on: Dec 09, 2025 | 4:05 PM

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత (ఆయేషా) ఘనవిజయం సాధించారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆయన్ను వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆయన భార్యకు మద్దతివ్వడం చర్చనీయాంశంగా మారింది. వివాదాలను దాటుకొని జానీ మాస్టర్ తిరిగి బిజీగా మారగా, ఆయన భార్య సుమలత ఎన్నిక కావడంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ ఆయేషా తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సుమలత తన ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్‌పై 29 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో ఆయన్ను అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన వారే ఇప్పుడు ఆయన భార్యకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఈ వివాదాల తర్వాత జానీ మాస్టర్ ఫేడ్ అవుట్ అవుతారని అంతా భావించారు. అయితే, ఆయన అన్నిటినీ దాటుకొని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అవకాశాలు అందుకుంటూ తిరిగి బిజీ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డీప్‌ఫేక్ కంటెంట్.. టేక్ యాక్షన్.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

TVK సభకు గన్ తో వచ్చిన వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Gold Price Today: మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా

Mohammed Kaif: వాళ్లిద్దరూ లేకుండా కప్ గెలవలేం

అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి