Jana Nayagan: జన నాయగన్ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు.. 8000 థియేటర్లలో రిలీజ్‌

Edited By:

Updated on: Jul 19, 2026 | 11:22 AM

దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా 8,000 థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. 30 దేశాల్లో గ్రాండ్ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్న మేకర్స్, విజయ్‌కు ఘన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నారు. థియేటర్ల సంఖ్యలో 'పుష్ప 2' రికార్డును అందుకోకపోయినా, ఓపెనింగ్ డే కలెక్షన్లలో కొత్త చరిత్ర సృష్టిస్తుందనే అంచనాలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి.

దళపతి విజయ్‌ ఆఖరి చిత్రం జన నాయగన్ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్‌ సర్టిఫికేట్ కూడా వచ్చేయటంతో ఈ నెల 23న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్‌. విజయ్‌కి గ్రాండ్‌గా సెండాఫ్ ఇచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న రిలీజ్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన టాప్ మూవీస్‌ సరసన నిలవబోతోంది జననాయగన్‌. ఏడు నెలల విజయ్‌ అభిమానులు ఎదురుచూపులకు త్వరలో తెర పడనుంది. ఈ నెల 23న జన నాయగన్‌ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఆఖరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ కావటంతో గ్రాండ్ సెండాఫ్‌కు రెడీ అవుతున్నారు అభిమానులు. మేకర్స్ కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ రేంజ్‌లో విజయ్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 30 దేశాల్లో జన నాయగన్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పెద్ద సంఖ్యలో థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. తొలి రోజు అన్ని భాషల్లో కలిపి 8000 థియేటర్లలో సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న టాలీవుడ్ రికార్డ్‌లను మాత్రం టచ్‌ చేయలేకపోయింది జన నాయగన్‌. ఇప్పటి వరకు తొలి రోజు అత్యధిక థియేటర్లలో ప్రదర్శించబడిన సినిమాగా పుష్ప 2 టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాను 12 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆ తరువాత స్థానంలో బాలీవుడ్ మూవీ జవాన్‌ సెకండ్ ప్లేస్‌ ఉంది. ట్రిపులార్‌, కేజీఎఫ్‌ 2, కల్కి సినిమాలు 9000 థియేటర్లలో రిలీజ్‌ అయ్యాయి. అయితే జన నాయగన్ విషయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయినా.. ఓపెనింగ్‌ డే ఆల్‌ టైమ్‌ హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించటం ఖాయం అంటున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రతి సినిమాకు కొత్త అవతారం… స్టార్ హీరోల మేకోవర్ వెనక భారీ కష్టం..!

Deepika Padukone: ప్రెగ్నెంట్‌గా ఉండి రిస్కీ స్టంట్స్‌.. దీపిక డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఇండస్ట్రీ

పెళ్లి తర్వాతే అసలైన జోరు… మ్యారీడ్ హీరోయిన్లదే ఇప్పుడు ఇండస్ట్రీలో హవా..!

Varun Tej: హిట్ సెంటిమెంట్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్.. ‘కొరియన్ కనకరాజు’పై భారీ ఆశలు

Varanasi: వారణాసికి అనుకోని సమస్య.. జక్కన్న ప్లాన్ ఏంటో..?

Follow Us