Dasara 2026: దసరా బరిలో రెండు క్రేజీ ప్రాజెక్టుల ఫైట్
ఈ దసరాకు బాక్సాఫీస్ పోటీ ప్రధానంగా రజినీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాల మధ్య ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంపై భారీ అంచనాలుండగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ‘రణబాలి’ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ధనుష్ నటిస్తున్న ‘ఓం’ సినిమా వాయిదా పడటంతో ఈ రెండు చిత్రాల పోటీపై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది.
దసరా బాక్సాఫీస్ బరిలో ముందుగా చాలా సినిమాలు పోటీ పడతాయని అనుకున్నా, చివరికి మాత్రం రెండు క్రేజీ ప్రాజెక్టుల మధ్యే అసలైన ఫైట్ జరగబోతోంది. ధనుష్ ‘ఓం’ కూడా వాయిదా పడి రేసు నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడిద్దరు హీరోల మధ్యే డైరెక్ట్ క్లాష్ మొదలైంది. మరి ఈ దసరాకు రాబోయే ఆ రెండు సినిమాలేంటి.. అందులో దేనిపై అంచనాలు ఎలా ఉన్నాయి..? ఈసారి దసరాకు రెండు సినిమాలే రాబోతున్నాయి. అక్టోబర్ 15న రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 థియేటర్లలోకి రాబోతోంది. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో అదరగొట్టేసి అంచనాలను ఆకాశానికి పెంచేసింది. బ్లాక్‌బస్టర్ జైలర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తుండటంతో సినిమా రిజల్ట్‌పై మేకర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. జైలర్ 2 వచ్చిన మరుసటి రోజే.. అంటే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇది 18వ శతాబ్దం నాటి రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్‌గా రాబోతోంది. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నిజానికి అక్టోబర్ 16న ధనుష్ నటిస్తున్న ‘ఓం’ సినిమా కూడా రావాల్సి ఉన్నా.. అది నవంబర్ 20కి వాయిదా పడింది. దీంతో దసరా బాక్సాఫీస్ రేస్ పూర్తిగా జైలర్ 2 Vs రణబాలి అన్నట్లుగా మారిపోయింది. మరి రజినీతో రౌడీ బాయ్ పోరు ఎలా ఉండబోతుందో.. బాక్సాఫీస్ దగ్గర ఈసారి దసరాకు వసూళ్ల వర్షం కురిపించబోయేదెవరో వేచి చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్స్ కోసం హీరోల సొంత డైరెక్షన్..
ఏఐతో రిస్క్ తప్పదు.. అయినా ఆపలేం!
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక