Jagapathi Babu: ‘పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు

Updated on: Jun 09, 2026 | 3:21 PM

‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి పాత్రకు ప్రాణం పెట్టి నటించినప్పటికీ, తనకు రావాల్సిన గుర్తింపు పూర్తిగా రావడం లేదని జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదల తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, అలాంటి నటనకు గుర్తింపు ఆశించడం తప్పు కాదన్నారు.

నటీనటులెవరైనా.. ఓ సినిమాలోని ఓ ఛాలెంజింగ్ రోల్ పడిందంటే ప్రాణం పెట్టి నటిస్తారు. ఆ పాత్రలో జీవించాలని పరితపిస్తుంటారు. అందుకోసం తెగ కష్టపడతారు. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా జెస్ట్ గుర్తింపును మాత్రమే కోరుకుంటారు. తాను కూడా అదే గుర్తింపు కోరుకున్నానని.. కానీ తనకు ఆ గుర్తింపు ఎందుకో అనుకున్నంతగా రావడం లేదంటూ.. జగపతి తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మెగా పవర్స్‌ రామ్‌ చరణ్ పెద్ది మూవీ సూపర్ డూపర్ హిట్టైంది. దిమ్మతిరిగే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో జగపతి బాబు అప్పల సూరిగా అందర్నీ ఆకట్టుకున్నాడు. సినిమాలో హీరోకు మార్గనిర్ధేశకం చేసే క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. తన యాక్టింగ్‌తో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద మూవీకి మరింత ప్రచారం కల్పించేందుకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన జగపతి బాబు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తానేదో కేవలం సినిమాలు చేసుకుంటూ వెళ్లే వ్యక్తిని కాదని చెప్పిన జగపతి బాబు.. ‘పెద్ది’ చిత్రంపై ఎంతో ప్రాణం పెట్టుకున్నానన్నాడు. పెద్ది రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీకి చెందిన ఒక బడా డైరెక్టర్ తనకు ఫోన్ చేసి, ఇంత గొప్ప పాత్ర చేసినా మిమ్మల్ని ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు? అదే పరభాషా నటులు చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేసేవారు కదా! అని చెప్పారడన్నాడు. తాను కూడా దర్శకుడు బుచ్చిబాబును ఇదే ప్రశ్న అడిగానని.. షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు చప్పట్లు కొట్టిన వాళ్లు, ఇప్పుడు తనను మర్చిపోతున్నారా అనే సందేహం వ్యక్తం చేశానన్నాడు జగపతి. అంతేకాదు అప్పల సూరి పాత్ర కోసం తాను అంతగా కష్టపడ్డానని.. అలాంటప్పుడు గుర్తింపు కోరడంలో తప్పులేదు కదా అన్నాడు ఈయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Published on: Jun 09, 2026 03:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us