Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

Updated on: Feb 27, 2026 | 10:54 PM

ఒకప్పుడు సినిమాకు కథే ముఖ్యం, కానీ ఇప్పుడు వివాదాలు సర్వసాధారణం. సెన్సార్ బోర్డు నుండి సుప్రీంకోర్టు వరకు అనేక చిత్రాలు న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోతున్నాయి. 'కేరళ స్టోరీ 2', 'ఘూస్‌ఖోర్ పండిట్', 'జన నాయగన్' వంటి చిత్రాలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, రణ్‌వీర్‌ సింగ్, శివకార్తికేయన్ సినిమాలూ వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు వివాదాలు తప్పడం లేదు.

ఒకప్పుడు సినిమాకి కథ ముఖ్యం.. కానీ ఇప్పుడు కాంట్రవర్సీ కామన్ అయిపోయింది. సెన్సార్ బోర్డు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ సినిమా చూసినా వివాదాల్లోనే నలుగుతోంది. ప్రస్తుతం సౌత్ టూ నార్త్ చాలా సినిమాలు కోర్టులో తమ ఫ్యూచర్ ఏంటో తెలియక తికమకపడుతున్నాయి. మరి అలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సినిమాలేంటో ఓసారి చూద్దామా..? కేరళ స్టోరీ 2 రిలీజ్ కాకముందే కేరళ హైకోర్టు మెట్లెక్కింది. మత సామరస్యం దెబ్బ తింటుందన్న పిటిషన్లతో కోర్టు మొట్టికాయలు వేయగా.. సెన్సార్ బోర్డు 16 కట్స్ ఇచ్చింది. ముందు మాకు చూపించి విడుదల చేస్కోండంటూ కేరళ కోర్టు ఆదేశించింది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ఘూస్‌ఖోర్ పండిట్’ టైటిల్‌పై బ్రాహ్మణ సంఘం సుప్రీం కోర్టుకు వెళ్లగా.. మేకర్స్ వెనక్కి తగ్గి టైటిల్ మారుస్తామన్నారు. జన నాయగన్ ఇంకా సెన్సార్ చిక్కుల్లోనే ఉంది. కొన్ని సీన్స్‌పై అభ్యంతరాలతో వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో రిలీజ్ సస్పెన్స్‌గా మారింది. విజయ్ పాలిటిక్స్‌లో ఉండటం కూడా దీనికి ఓ మైనస్. ఇక రణ్‌వీర్‌ సింగ్ ధురంధర్ 2 సినిమా షూటింగ్‌లో రూల్స్ బ్రేక్ చేసి ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించారని.. ఏకంగా ముంబై కార్పొరేషన్ ప్రొడక్షన్ హౌస్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి నోటీసులు ఇచ్చింది. కోలీవుడ్‌లో ఈ టైటిల్ గొడవలు ఎక్కువయ్యాయి. శివకార్తికేయన్ కొత్త సినిమా సేయోన్ టైటిల్‌ను తాము ముందే రిజిస్టర్ చేశామంటూ మాయోన్ సినిమా మేకర్స్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఈ టైటిల్ ఓనర్షిప్ పంచాయితీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి చేరింది. కార్తికేయ స్వామి కథతో వస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. మరి ఈ వివాదాలన్నీ ఎప్పటికీ తీరుతాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం

Follow Us