iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే

Updated on: Dec 06, 2025 | 1:56 PM

ఐ బొమ్మ రవి కేసులో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కీలక వివరాలు వెల్లడించారు. రవికి పశ్చాత్తాపం లేదని, మూడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి విలాసవంతమైన జీవనం గడిపాడని తెలిపారు. మరిన్ని ఆర్థిక లావాదేవీలు వెలికి తీయడానికి కస్టడీని పొడిగించనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. మిర్రర్ సైట్లు మూసివేసినట్లు తెలిపారు.

ఐ బొమ్మ రవి విచారణలో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. టీవీ9‌తో మాట్లాడిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కేసు పురోగతిపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ఐ బొమ్మ రవిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదని.. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పినట్లు వివరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ముందుపెట్టాక కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా సాక్షాలు సేకరణ జరుగుతోందని డీసీపీ అరవింద్ చెప్పారు. రవి మూడు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని డీసీపీ తెలిపారు. ఆ ప్రమోషన్‌ల ద్వారా వచ్చిన డబ్బుతోనే అతను లావిష్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడ్డాడని చెప్పుకొచ్చారు. డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇంకా సమాచారం రవి వద్దనే ఉందని.. అందుకే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని డీసీపీ అరవింద్ బాబు అన్నారు. రవికి సంబంధించిన పలు ఆర్థిక లింకులు ఇంకా బయటపడాల్సి ఉందన్నారు. ఇక రవికి పోలీస్ డిపార్ట్‌మెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిందని బయట జరుగుతున్న ప్రచారంపై కూడా డీసీపీ స్పందించారు.ఐ బొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ ఇవ్వలేదన్నారు. బయట ఊహాగానాల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఐ బొమ్మతో అనుబంధంగా పనిచేస్తున్న మిర్రర్ సైట్లను పూర్తిగా మూసివేసినట్లు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఇక డీసీపీ వ్యాఖ్యలతో కేసు దర్యాప్తు మరో దశకు చేరుకుందని స్పష్టమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..

సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ

SpiceJet: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు