Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..

Updated on: Oct 30, 2026 | 6:25 PM

యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ‘హుషారు’ సినిమాకు కొనసాగింపుగా ‘హుషారు 2’ తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో తాను నటించడానికి గల కారణాన్ని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించారు. నిరుద్యోగం, శ్రమదోపిడీ, యువత ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాలో చూపించారని ప్రశంసించారు. యువత ఆత్మాభిమానంతో జీవించాలనే సందేశం ఈ చిత్రంలో ఉందని పేర్కొన్నారు.

హుషారు..! అప్పట్లో కుర్రాళ్లకు నచ్చేసిన ఈ సినిమాకు కంటిన్యూగా హుషారు 2 పేరుతో మరో సినిమా రాబోతోంది. ఇందుకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్లో ఆర్‌ నాయారయణ మూర్తి కనిపించడం ఒక్క సారిగా అందర్నీ షాక్‌ కు గురిచేసింది. తన సినిమాల్లో తప్పితే.. వేరే డైరెక్టర్ల సినిమాల్లో నటించకుండా ఇన్నాళ్లూ ఉన్న ఆర్ నారాయణ మూర్తి ఈ సినిమాలో మాత్రం ఓ కీ రోల్ చేశారు. అయితే ఎందుకు ఈ రోల్ చేశాననేది కూడా ఈయనే స్వయంగా హుషారు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పేశారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ కూడా అవుతున్నారు. హుషారు 2 టీజర్‌ ఈవెంట్‌ రీసెంట్‌గా గ్రాండ్‌ గా జరిగింది. ఈ ఈవెంట్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలోనే తన స్టైల్లో ఆయన మాట్లాడారు. శ్రమ దోపిడీ గురించి.. ప్రైవేట్ కంపెనీలు యువతతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేశారు.దాంతో పాటే ఈ సినిమాలో తాను నటించడానికి కారణాన్ని కూడా వివరించారు నారాయణ మూర్తి. “హర్ష ‘హుషారు 2’లో నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ‘హుషారు’లో ఎంత నవ్వించారో.. అంతకు మించి నవ్విస్తూనే, ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను ఎంతో గొప్పగా చూపించారు. పని హక్కుని కోల్పోతోన్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లేదు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా కూడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. కెమెరామెన్ ఎంతో ఓర్పుగా ఉన్నాడు. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా సరే స్టార్‌లను చేస్తారు. అలా ఈ మూవీని జనాలకు నచ్చేలా హర్ష తీశారు. ‘హుషారు 2’ మూవీని జనాల వద్దకు తీసుకు వెళ్లాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు నారాయణ మూర్తి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ

Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

నరకయాతన అంటే ఇదేనేమో.. త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు

Loading...
Unable to load recommendations.
Follow Us