Anushka Shetty: వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!

Updated on: Nov 21, 2024 | 1:48 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అనుష్క. 2005లో విడుదలైన ఈమూవీలో నాగార్జున పక్కన హీరోయిన్‌గా చేసింది అనుష్క. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫాలోయంగ్ సంపాదించుకుంది.

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో యాక్ట్ చేసిన అనుష్క.. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌ హిట్‌తో.. సూపర్ స్టార్‌గా మారిపోయింది. కానీ ఎందుకనో ఆ సినిమా తర్వాత సినిమాలను తగ్గించేంది. కానీ తన ఫ్యాన్స్‌ కారణంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు కూడా తన నెల సంపాదనతో.. తన మొత్తం ఆస్తుల విలువతో.. సోషల్ మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది అనుష్క.

ఇక అనుష్క ఎప్పుడూ సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. కానీ ఆమె సంపాదన, కార్ కలెక్షన్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోద్ది. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు , మోడలింగ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. నటనలోకి రాకముందు అనుష్క యోగ శిక్షకురాలు. ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద శిక్షణ పొందింది.

ఒక నివేదికల ప్రకారం అనుష్క ఆస్తుల విలువ రూ.140 కోట్లు. ఆమె నెలకు దాదాపు 1 కోటి వరకు సంపాదిస్తుంది. అంటే సంవత్సరానికి రూ.12 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. ఒక్క సినిమాకు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అంతేకాదు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అనుష్కకు రూ.12 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉందని న్యూస్. అలాగే హైదరాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో అందమైన ఫామ్‌హౌస్ కూడా ఉందట ఈ బాహుబలి బ్యూటీకి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 21, 2024 01:48 PM
Loading...
Unable to load recommendations.
Follow Us