Geethanjali Malli Vachindi: OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
ఇక థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే అంటే మే 8 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. దాంతో పాటే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
తెలుగమ్మాయి అంజలి నటించిన 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. సుమారు పదేళ్ల క్రితం చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకులను బాగా భయపెట్టిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీపై మొదట మంచి హైప్ వచ్చింది. శ్మశానంలో టీజర్ లాంఛ్ చేయడం మొదలు రిలీజ్ దాకా వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించారు. పైగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు, అంచనాలతో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఆడియెన్స్ ను బాగానే భయపెట్టించింది. అలాగే కడుపుబ్బా నవ్వించింది.
ఇక థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే అంటే మే 8 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. దాంతో పాటే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.