Aishwarya Rai: లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!

|

Oct 27, 2024 | 8:15 AM

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ 20 ఏప్రిల్ 2007న వివాహ బంధంతో ఏకమయ్యారు. పెళ్లయిన 4 సంవత్సరాల తరువాత, ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఆరాధ్యకు 12 ఏళ్లు నిండాయి. ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ తన కూతురి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటోంది. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎప్పుడూ తన తల్లితోనే కనిపిస్తుంది. కాగా ఆరాధ్యకు కూడా అమ్మ అందమే వచ్చిందని.. తను పక్కాగా హీరోయిన్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకున్నారనే పుకార్లపై ఐశ్వర్యారాయ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసేసుకున్నారు అంటూ కూడా వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందం, అభినయంతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఐశ్వర్య రాయ్ 14.3 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు కానీ ఐశ్వర్య రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 1 వ్యక్తిని మాత్రమే అనుసరిస్తున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఆమె భర్త అభిషేక్ బచ్చన్.

ఎస్ ! ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ను మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది. ఐశ్వర్యారాయ్ తన భర్తతో కలిసి కొన్ని ఫోటోలను కూడా గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక ఐశ్వర్య రాయ్ అక్టోబర్ 22 న తన తల్లి, కుమార్తె ఆరాధ్యతో సహా తన కుటుంబంతో .. కజిన్ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోను ఐశ్వర్యారాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలో అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. దీంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.