Mokshagna Teja: మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

|

Oct 26, 2024 | 12:22 PM

బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ అదిరిపోయే స్టోరీని రెడీ చేశాడని.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందనే టాక్ ఇప్పుడు బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.

నటసింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తు ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందనే టాక్ ఇప్పుడు బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ టాక్ మరేదో కాదు.. ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ గురించే ఆ టాక్. ఎస్! మోక్షు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీలో.. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు.. రాషా థడాని హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చిన ఆమె.. మోక్షు సినిమాలో.. ఆల్మోస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. అంతేకాదు నవంబర్ చివరి వారం నుంచి ప్రారంభమయ్యే షూటింగ్‌లో.. రాషా కూడా మోక్షుతో కలిసి పాల్గొంటుందనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. నందమూరి అభిమానులను ఖుషీ అయ్యేలా.. ఈమె ఫోటోలను వెతికి మరీ చూసేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.