Raja Saab: డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న కల్కి మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. అదే సమయంలో సైలెంట్ గా రాజాసాబ్ షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

అయితే సైలెంట్ గా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదొక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే బేబీ మూవీ ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలయ్యింది. మ్యూజిక్ సింబల్స్ పెట్టి ఎస్కేఎన్ ట్వీట్ చేయగా.. దానికి డైరెక్టర్ మారుతీ స్మైల్ సింబల్ ఇచ్చారు. దీంతో రాజాసాబ్ నుంచి త్వరలోనే సాంగ్ రాబోతుందని నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ హీరో తేజ.
ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకలో ప్రోడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కు రాజా సాబ్ మూవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కల్కి మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ నుంచి అప్డేట్స్ వస్తాయని అని ప్రొడ్యూసర్ అన్నారు. అదే సమయంలో తేజ మాట్లాడుతూ త్వరలోనే రాజా సాబ్ వస్తుందని డౌట్ గా ఉందండి అంటూ కామెంట్స్ చేశారు. తేజ మాటలకు చిరు నవ్వుతో రిప్లై ఇచ్చారు ప్రొడ్యూసర్. దీంతో త్వరలోనే రాజాసాబ్ సాంగ్ రాబోతుందనే విషయం పై మాత్రం క్లారిటీ వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!