Gaddar Awards 2025: గద్దర్ అవార్డుల సందడి: మెగాస్టార్‌కు ‘ఎన్టీఆర్’ పురస్కారం..

Updated on: Mar 08, 2026 | 5:59 PM

గద్దర్ అవార్డులు 2025 విజేతల జాబితా విడుదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని జ్యూరీ ఈ వివరాలను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ జాతీయ పురస్కారం', కమల్ హాసన్‌కు 'పైడి జయరాజ్ అవార్డు' దక్కాయి. జయసుధ, అశ్విని దత్, సుద్దాల అశోక్ తేజ వంటి ప్రముఖులకు కూడా అవార్డులు లభించాయి. మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రదానోత్సవం జరగనుంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డుల’ (2025) విజేతల జాబితా శనివారం అధికారికంగా విడుదలైంది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని స్పెషల్ జ్యూరీ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది అత్యున్నత పురస్కారాల్లో ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు దశాబ్దాలుగా అసమానమైన సేవలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం సత్కరించనుంది. అలాగే, వెండితెరపై తన విలక్షణ నటనతో లోకనాయకుడిగా పేరుగాంచిన కమల్ హాసన్‌ను ‘పైడి జయరాజ్ అవార్డు’ వరించింది. 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఈ ఎంపిక జరిగింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి అవార్డు’, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు’ దక్కాయి. ఈ పురస్కారాలను ఈ నెల‌ మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రదానం చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పొలంలో త్రిశూలాలు.. ఆశ్చర్యపోయిన జనం..

పెళ్లికి 13 రోజుల ముందు విషాదం..

ఇరాన్ యుద్ధంతో చుక్కల్లో విమాన చార్జీలు.. అమెరికా ప్రయాణం భారమే

ఇదేం విడ్డూరం స్వామీ.. ఆటోలకు బేడీలా

Telangana: తెలంగాణపై భానుడి ఉగ్రరూపం.. 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Follow Us