టాలీవుడ్‌కు కొత్త అందాలు..ఒకేసారి ఐదుగురి ఎంట్రీ..!

Edited By:

Updated on: Oct 15, 2026 | 7:06 PM

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నితిన్‌ నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’తో ఆఫియా సయాద్‌ పరిచయం కానుండగా, మేధ మేక, సాత్విక వీరవల్లి కూడా తెలుగు సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ప్రభాస్‌ ‘ఫౌజీ’తో ఇమాన్వి ఇస్మాయిల్‌, ‘స్పిరిట్‌’తో త్రిప్తి దిమ్రి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఐదుగురు భామల రాకతో టాలీవుడ్‌లో కొత్త ముఖాలు సందడి చేయనున్నాయి. వీరి సినిమాలు ఎలాంటి విజయాలు అందుకుంటాయో చూడాలి.

టాలీవుడ్‌కు ఎప్పటి నుంచో ఉన్న హీరోయిన్ల షార్టేజ్ కొత్త బ్యూటీల ఎంట్రీతో తీరిపోనుందా..? క్రేజీ సినిమాల్లో వరుసగా ఫ్రెష్ ఫేసెస్ ఎంట్రీ ఇస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ కొత్త గ్లామర్‌తో మెరిసిపోనుందా..? ఒకేసారి ఐదుగురు హీరోయిన్స్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. మరి వాళ్లెవరో ఆ సినిమాలేంటో చూద్దామా..? నాని నిర్మాతగా నితిన్ హీరోగా మురళీకాంత్ తెరకెక్కిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’తో ఆఫియా సయాద్ అనే కొత్తమ్మాయి పరిచయం అవుతున్నారు. సినిమా హిట్టైతే ఈ బ్యూటీ హవా కనిపించడం ఖాయం. ఇక శ్రీకాంత్ కూతురు మేధ మేక కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో డెబ్యూ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’తో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ ఏకంగా ‘ఫౌజీ’తో ప్రభాస్‌తో జోడీ కట్టేసారు. ఇవి హిట్టైతే వీళ్ళ జాతకం మారడం ఖాయం. యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి కూడా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ‘స్పిరిట్’తో ఈమె మెయిన్ హీరోయిన్. ఒకేసారి ఇంతమంది కొత్త హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రావడం శుభపరిణమామే. మొత్తానికి ఈ ఫ్రెష్ ఫేసెస్ రాబోయే రోజుల్లో హీరోయిన్ల కరువు లేకుండా చేస్తుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్‌ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా

హైదరాబాద్‌–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!

విమానంలో షాకింగ్‌ ఘటన.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికిన నటి

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

Loading...
Unable to load recommendations.
Follow Us