ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

Updated on: Aug 19, 2026 | 12:03 PM

టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా బోనాల్లో పాల్గొనడంపై మతపరమైన ట్రోలింగ్ దుమారం రేపింది. తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఉన్న స్థానం కేవలం మతపరమైనది కాదని, అది సాంస్కృతిక వేడుక అని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు. మత విద్వేషాలను పెంచడం తగదని ఫరియా అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ ట్రోలింగ్‌ను బీజేపీ చీఫ్ రామచంద్ర రావు ఖండించారు.

టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా ఇటీవల బోనాల వేడుకల్లో పాల్గొనడం తీవ్ర చర్చకు దారి తీసింది. అచ్చమైన తెలంగాణ ఆడపడుచులా కట్టుబొట్టుతో బోనం ఎత్తిన ఫరియా, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. అయితే, ఆమె మతాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఉన్న స్థానం కేవలం ఒక మతానికి చెందిన ఆచారంగా చూడకూడదని, ఇది సాంస్కృతిక పండుగ అని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా చాలా మెచ్యూర్డ్‌గా స్పందించారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ దేవుడిని చూడడమే అసలైన భక్తి అని, దేవుడు మతపు గోడల్లో బంధించబడే వ్యక్తి కాదని ఆమె అన్నారు. ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతకడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us