Sai Pallavi: తన కంటే ముందు చెల్లె పెళ్లిపై అసలు నిజం చెప్పిన సాయి పల్లవి.!

|

Jan 30, 2024 | 10:09 AM

ఓ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అక్కాచెల్లెళ్లు ఉంటే.. ముందు పెళ్లి ఎవరికి చేస్తారు.. అక్కకే చేస్తారుగా..! కానీ చెల్లెకు చేస్తున్నారు సాయి పల్లవి పేరెంట్స్. అయితే విషయం వారి పర్సనల్ అయినప్పటికీ... మనకు మాత్రం సాయి పల్లవి ఓ స్టార్. పబ్లిక్ సెలబ్రిటీ. దీంతో అక్కకు కాకుండా.. ముందు చెల్లికి.. పెళ్లి ఏంటనే కామెంట్ నెట్టింట తీవ్రంగా వస్తోంది. ఈ విషయంగా.. సాయి పల్లవి రిప్లై కోసం వెయిట్ చేసే వారి సంఖ్య.. రియాక్షన్ ప్లీజ్ అంటూ.. అడుతున్న వారి సంఖ్య.. సోషల్ మీడియాలో రోజురోజుకూ ఎక్కువవుతోంది.

ఓ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అక్కాచెల్లెళ్లు ఉంటే.. ముందు పెళ్లి ఎవరికి చేస్తారు… అక్కకే చేస్తారుగా..! కానీ చెల్లెకు చేస్తున్నారు సాయి పల్లవి పేరెంట్స్. అయితే విషయం వారి పర్సనల్ అయినప్పటికీ… మనకు మాత్రం సాయి పల్లవి ఓ స్టార్. పబ్లిక్ సెలబ్రిటీ. దీంతో అక్కకు కాకుండా.. ముందు చెల్లికి.. పెళ్లి ఏంటనే కామెంట్ నెట్టింట తీవ్రంగా వస్తోంది. ఈ విషయంగా.. సాయి పల్లవి రిప్లై కోసం వెయిట్ చేసే వారి సంఖ్య.. రియాక్షన్ ప్లీజ్ అంటూ.. అడుతున్న వారి సంఖ్య.. సోషల్ మీడియాలో రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇక వీరి వెయింటింగ్‌కు తగ్గట్టే.. పెళ్లి పై రియాక్టైన సాయిపల్లవి త్రో వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే సాయి పల్లవి సమాధంగా కూడా మారిపోతోంది.

ఇక ఆ త్రో బ్యాక్ వీడియోలో సాయి పల్లవి.. తన పెళ్లిపై ఏం అన్నారంటే..! “నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకి వివాహంచేసుకోవాలని అనుకున్నా.. అలాగే 30 ఏళ్ల లోపు పిల్లలను కూడా కన్నేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి. దాంతో పెళ్లి వాయిదా వేశా.. సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నా..” అని సాయి పల్లవి చెప్పిన ఓ పాత వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. ఈ వీడియోనే తన పెళ్లి గురించి ఆరా తీస్తున్న తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ అండ్ నెటిజన్స్‌కు ఆన్సర్‌లా మారుతోంది. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos