నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ
దృశ్యం 3 రాబోయే మలయాళ, హిందీ వెర్షన్‌ల మధ్య కథలో మార్పులపై నిర్మాతలు స్పష్టతనిచ్చారు. మలయాళ వెర్షన్‌కు ఫ్రేమ్-టు-ఫ్రేమ్ రీమేక్ కాకుండా, హిందీ వెర్షన్‌లో థ్రిల్లింగ్ అంశాలు, కొత్త ఇన్వెస్టిగేషన్ యాంగిల్, కొత్త పాత్రలు ఉంటాయని తెలిపారు. ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రీమేక్‌లతో సంచలనం సృష్టిస్తోంది.
ఒక సంచలనం, కేవలం సినిమా పేరు కాదు. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మొదటి భాగం 2013లో విడుదలై మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై భారీ వసూళ్లను సాధించి, తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భారతీయ భాషలలో రీమేక్ అయింది. దృశ్యం 2 కోవిడ్ సమయంలో ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు, దృశ్యం 3 రాకతో మలయాళ, హిందీ వెర్షన్ ట్రైలర్లలో భిన్నత్వం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పనోరమా స్టూడియోస్ అధినేతలు కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ స్పష్టతనిచ్చారు. హిందీ వెర్షన్ మలయాళ చిత్రానికి ఫ్రేమ్-టు-ఫ్రేమ్ రీమేక్ కాదని, కథా గమనం, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్‌లో భారీ మార్పులు ఉంటాయని వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో సీజన్ ప్లాన్ చేస్తోన్న..మనీ హెయిస్ట్
Follow Us
