Naga Chaitanya-Sobhita Dhulipala: రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం.. నాగచైతన్య కానుకలు తీసుకుంటున్నారా.?

Updated on: Nov 15, 2024 | 9:32 AM

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఇప్పటికే ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు.ఈ ఏడాది డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ పెళ్లి వేడుక జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని టాక్.

నాగ చైతన్య- శోభితల పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. తమకు కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగానే కానుకలు ఇవ్వనున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నాగచైతన్యకు రేసింగ్ కార్లంటే చాలా ఇష్టమని తెలుసుకుని, ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్‌ బైక్‌ కూడా అతనికి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను ఇవ్వనున్నారట.

అయితే మరోవైపు అక్కినేని కుటుంబం తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభితతో పాటు వారి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అందుకే శోభిత కూడా ఎలాంటి ఆస్తిపాస్తులు తీసుకురాకుండా కేవలం బంగారం మాత్రమే తీసుకొస్తోందని నెట్టింట వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే పెళ్లయ్యే వరకు ఆగాల్సిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us