RGV Den Viral: ఇదేందయ్యా.. ఇది..! ఇది ఆఫీసా.. లేక కొంపా..! అంతకు మించి డిజైన్..

Updated on: Jun 14, 2023 | 8:48 AM

అది ఇళ్లే కానీ.. ఆఫీసే కానీ..! అందులోని ఇంటీరియర్‌ డిజైన్ మన అభిరుచికి అద్దం పడుతుంది. మనల్ని.. మన నేచర్‌ని ఆవిష్కరిస్తుంది. మన మనస్తత్వం ఏంటో చూసిన వారికి తెలిసేలా చేస్తోంది. మరి అదే ఆఫీస్‌ ఆర్జీవీది అయితే.. ఎలా ఉంటుంది. మీరు ఊహిస్తున్నట్టే..

అది ఇళ్లే కానీ.. ఆఫీసే కానీ..! అందులోని ఇంటీరియర్‌ డిజైన్ మన అభిరుచికి అద్దం పడుతుంది. మనల్ని.. మన నేచర్‌ని ఆవిష్కరిస్తుంది. మన మనస్తత్వం ఏంటో చూసిన వారికి తెలిసేలా చేస్తోంది. మరి అదే ఆఫీస్‌ ఆర్జీవీది అయితే.. ఎలా ఉంటుంది. మీరు ఊహిస్తున్నట్టే.. పచ్చి బూతుగా కూడా… ఉంది. కానీ దాంతో పాటే.. తన స్టైల్ ఆఫ్ ఫిలాసిఫీని పోట్రేట్‌ చేస్తోంది. ఎస్ ! ఫిల్మ్ మేకింగ్‌లోనే కాదు.. థికింగ్లోనూ.. డిఫరెంట్ అనిపించుకున్న రామ్‌గోపాల్ వర్మ… తాజాగా తన నయా ఆఫీసును.. ఓపెన్‌ చేశారు. త్రీ ఫ్లోర్ బిల్డింగ్‌లో.. తన ఎంప్లాయిస్‌తో.. కంటెంట్‌ క్రియేషన్‌లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందుకు నాంది అన్నట్టు.. ఆ ఆఫీసుకు.. డెన్‌ అనే క్రేజీ నేమ్‌ పెట్టారు. అంతేకాదు.. తన ఆఫీస్‌లోని గోడలపై.. అక్కడక్కడా.. తనకు నచ్చిన.. గ్రేట్ రైటర్స్‌ ఫిలాసఫికల్ కోట్స్‌ను.. రాపించారు. తన కెరీర్‌ బిగినింగ్ అండ్ టర్నింగ్ విశేషాలు తెలిసేలా.. ఆనాటి ఫోటోలను ఎగ్జిబిషన్‌లా ఏర్పాటు చేశారు. గ్రీన్‌ లీఫ్‌తో.. అచ్చం కేవ్‌లా కనిపించేలా డిజైన్‌ చేసుకున్నారు. ఇలా అంతా బానే ఉంటే.. అది ఆర్జీవీ ప్రాపర్టీ ఎందుకవుతుంది. అందుకే ఆ ఆఫీస్‌లోపల తన సినిమాల్లో యాక్ట్ చేసిన.. తనను ఇంప్రెస్ చేసిన హీరోయిన్ల బికినీ ఫోటోలను అక్కడక్కడా అంటించారు ఆర్జీవీ. ఇక తన ఆఫీస్‌ రూంలో అయితే ఏకంగా ఏరోటిక్ న్యూడ్‌ ఫోటోలను పెట్టేసుకున్నారు. తను ఎప్పుడూ చెప్పే వుమెన్.. నేచర్‌.. కాంబినేషన్‌ గురించి.. తనకు నచ్చిన ఫిలాసఫికల్ లైన్స్‌ మధ్యలో డిప్లే చేసి.. తన మైండ్ సెట్ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేశారు ఆర్జీవీ. ఇక దాంతో పాటు.. తన డెన్‌ లో ఉన్న ఈ ఫోటోలతో.. ట్రోల్ కూడా అవుతున్నారు ఈ కాంట్రో డైరెక్టర్‌. ఇది ఆఫీస్‌లా లేదని.. బ్రోతల్ కొంపలా ఉందనే.. స్ట్రాంగ్ కామెంట్ నెట్టింట నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!