Krish on Konda Polam: డైరెక్టర్ క్రిష్ సంచలన కామెంట్స్.. కొండపొలం మూవీ నేను చేయకపోతే.. ఆయన చేసేవారు..!(వీడియో)

|

Oct 12, 2021 | 8:22 AM

మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండ‌పొలంతో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు..

మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండ‌పొలంతో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్నఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.. ‘పుస్తకంగా రాయడం వేరు.. దాన్ని సినిమాగా తీయడం వేరు. పుస్త‌కంలో రాసిన దానిని సినిమాగా తీయాలంటే దానికి కొన్ని పరిమితులుంటాయి అన్నారు. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక‌ అద్బుతమైన కథ. చ‌క్కటి కథనంతో రాశారు. ప్రతీ ఒక్క ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం అని తెలిపారు క్రిష్. ఇక నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు అక్క‌డ జ‌రిగే ప‌రిణామాలేంటి.? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు క్రిష్‌.

చేసే ప్రతీ సినిమా ఓ కొత్త బ్యాక్ డ్రాప్‌లో ఉండాలని అనుకుంటాను. ఇది వరకే వెంకటేష్ గారితో ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు అన్నారు. ఈ పుస్తకం గురించి ఇంద్రగంటి గారు, సుకుమార్ గారు సజెస్ట్ చేశారు. మామూలుగా దర్శకులం అంతా కూడా అప్పుడప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓ సారి మేమంతా కలిస్తే.. ఈ పుస్తకం గురించి చెప్పారు. అడ్వంచర్స్ కథ చెప్పాలని అనుకున్నప్పుడు.. సప్తభూమి, కొండపొలం పుస్తకాలు చదివాను. కొండపొలం బాగా నచ్చింది. అయితే కొండపొలం హక్కులు కొన్నావా? అని సుకుమార్ నన్ను అడిగారు. నేను తీసుకున్నాను అని చెప్పడంతో సుకుమార్ గారు వదిలేశారు. లేకుంటే ఆయన చేసేవారు కాబోలు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు క్రిష్.


మరిన్ని చదవండి ఇక్కడ : Corona-Donald Trump: ట్రంప్‌కు కరోనా షాక్‌..! ట్రంప్ ను దెబ్భ మీద దెబ్బ కొడుతున్న కరోనా.. ఏం జరిగిందంటే..?(వీడియో)

 Manchu Vishnu-Prakash Raj-MAA Elections: ప్రకాష్ రాజ్ రాజీనామాపై ‘మంచు విష్ణు’ సంచలన ప్రెస్ మీట్.. (వీడియో)

 Manchu Vishnu In MAA Elections 2021: విష్ణు విజయానికి కారణాలు ఇవే.. అసలు విషయాలు వెల్లడి.. (వీడియో)

 RCB Vs KKR in IPL 2021: ఎవరు ఇంటికి…ఎవరు సెమీస్ కి… ఈ ఉత్కంఠ సమరంపై మరిన్ని వివరాలు..(వీడియో)

Follow us on