Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ
"ధురంధర్" చిత్రం బాలీవుడ్‌లో ఊహించని విజయం సాధించింది. 1350 కోట్లకు పైగా వసూళ్లతో కాంతార, పుష్ప 2, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను అధిగమించింది. ఏ-సర్టిఫికేట్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 ఉత్తర అమెరికా రికార్డును బద్దలు కొట్టి, బాలీవుడ్‌లో అత్యంత వేగంగా 500 కోట్లు సాధించిన చిత్రంగా అనేక కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. దీని సీక్వెల్ "ధురంధర్ 2" మార్చి 19న విడుదల కానుంది.
కలలో కూడా ఊహించని విజయం అంటారు కదా.. ధురంధర్‌తో బాలీవుడ్ అలాంటి విజయాన్నే చూసింది. అసలు మేకర్స్ కూడా ఈ రేంజ్ సక్సెస్ ఊహించి ఉండరు. కేవలం హిందీ కాదు.. మరే ఇతర ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డులెన్నో సాధించింది. అందులో ఓ 10 ధురంధర్ సంచలనాలను ఒకసారి చూద్దాం. ఈరోజుల్లో ఓ సినిమా 20 రోజులు ఆడటమే గగనం అనుకుంటే.. గత 48 రోజులుగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ధురంధర్. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం 1350 కోట్లు వసూలు చేసి.. కాంతార ఛాప్టర్ 1 పేరుమీదున్న 800 కోట్ల రికార్డును 550 కోట్ల మార్జిన్‌తో దాటేసింది. అలాగే హిందీలో పుష్ప 2 పేరు మీదున్న 830 కోట్ల రికార్డును దాటేసింది. A సర్టిఫికేట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా ధురంధరే. గతంలో యానిమల్ పేరు మీదున్న 900 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్ల రికార్డును.. 1350 కోట్లతో చాలా ఈజీగా క్రాస్ చేసింది ధురంధర్. ఇక రెండో వారం నుంచి ఆరో వారం వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 పేరు మీదున్న రికార్డుల్ని తన పేర రాసుకున్నాడు ధురంధర్. బాలీవుడ్‌లో అత్యంత వేగంగా 500 కోట్ల నెట్ సాధించిన హిందీ సినిమా ధురంధర్. 17 రోజుల్లో జవాన్ 500 కోట్లు వసూలు చేస్తే.. అంతకంటే ముందే ధురంధర్ ఆ రికార్డ్ అందుకుంది. అలాగే బాహుబలి 2 పేరు మీద 9 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న నార్త్ అమెరికాలో 21 మిలియన్ రికార్డును సైతం ధురంధర్ క్రాస్ చేసింది. బాహుబలి 2 తర్వాత 20 మిలియన్ దాటిన రెండో సినిమా ఇదే. బాలీవుడ్‌లో 600, 700, 800 కోట్ల నెట్ ఫాస్టుగా అందుకున్న రికార్డ్.. 20 అంతకంటే ఎక్కువ కోట్లు వరసగా 20 రోజుల పాటు కలెక్ట్ చేసిన రికార్డ్… ఇక ఒకే భాషలో 1000 కోట్లు వసూలు చేసిన రికార్డ్.. భారీ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువ లాభాలు తెచ్చిన రికార్డ్.. ఇలా ఎన్నో ధురంధర్ పేరు మీదే ఉన్నాయి. మార్చి 19న ధురంధర్ 2 రాబోతుంది.. మరి అదేం చేస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా
ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్
Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క