Dhurandhar: ధురంధర్ ఎఫెక్ట్.. హీరోకు తీవ్రవాదుల ధమ్కీ
రణ్‌వీర్ సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు రావడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. డబ్బులు డిమాండ్ చేస్తూ వాయిస్ నోట్ పంపిన దుండగుడిపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, 'ధురంధర్' భారీ హిట్ తర్వాత, 'ధురంధర్ 2' మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా సౌత్ రికార్డులను అధిగమిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపు మెసేజ్ రావడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలంగా మారింది. ధురంధర్ సినిమా హిట్ తర్వాత.. టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ హీరోను… డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ ఆగంతకుడు.. వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపించాడు. అంతేకాదు ఆ నోట్‌లో తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వాడినంటూ.. ఆ దుండగుడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో.. రణ్‌వీర్ ఈ విషయాన్ని ముంబై పోలీసుల వరకు తీసుకెళ్లాడని.. ముంబయ్ పోలీసులు కూడా.. వెంటనే హీరో ఇంటి దగ్గర భద్రతను పెంచారని తెలుస్తోంది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేజీఎఫ్, బాహుహలి, పుష్ప సినిమాల కలెక్షన్స్‌ను అధిగమించింది. ఇదే మూవీ… దక్షిణాది భాషల్లో కూడా రిలీజై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదనే కామెంట్ కూడా ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ధురంధర్ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య ధురంధర్ మూవీ మార్చ్ 19న రిలీజ్ కానుంది. ఈ సారి హిందీలో మాత్రమే కాకుండా… పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో ధురంధర్ 2 సినిమా భారీ స్పాన్ లో రిలీజ్ కానుంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ విధ్వంసం సుస్పష్టం అని ఫిల్మ్ ట్రేడర్స్ అంటున్నారు. అతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో దంగల్ మినహా… సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో సౌత్ రికార్డులను ఈ సారి ధురంధర్ బద్దలు కొట్టడం ఖాయమని ఫిల్మ్ అనలిస్టులు కోట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్ సినిమాకు.. టికెట్ రేట్స్ పరేషాన్
