ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!

Updated on: Jul 02, 2026 | 10:46 AM

దేశంలో సినిమా థియేటర్ల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త థియేటర్లకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు గ్రామీణ, చిన్న పట్టణాల్లో మినీ థియేటర్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ చర్యలతో థియేటర్ల విస్తరణ, ఉపాధి అవకాశాలు, సినిమా పరిశ్రమ వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

భారతీయ సినిమా ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మన దేశంలో సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే జనాభాతో పోలిస్తే మాత్రం మన దగ్గర థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని రిపోర్ట్‌. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, సినిమా రంగాన్ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లడానికే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటి ముఖ్యమైన నిర్ణయం… థియేటర్ల లైసెన్సింగ్ కోసం ‘సింగిల్ విండో క్లియరెన్స్’ విధానం!! ఇంతకుముందు ఒక కొత్త మూవీ థియేటర్ లేదా మల్టీప్లెక్స్ తెరవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 15 నుండి 20 శాఖల చుట్టూ తిరిగి పర్మిషన్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. దీనివల్ల నెలలు, ఒక్కోసారి ఏళ్లు కూడా పట్టేది. కానీ ఇకపై అలా కాదు! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా, ఒకే ఒక్క పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు. అన్ని అనుమతులు వేగంగా, పారదర్శకంగా లభిస్తాయి. దీనివల్ల థియేటర్ల ఏర్పాటు చాలా సులువు అవుతుంది. ఇక రెండో నిర్ణయం… గ్రామీణ మరియు చిన్న పట్టణాలపై ప్రత్యేక దృష్టి!! ప్రస్తుతం మన దేశంలో మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయి. అందుకే కేంద్ర మంత్రిత్వ శాఖ, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. PPP మోడల్- ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన ‘మినీ థియేటర్ల’ నిర్మాణాన్ని వేగవంతం చేయడమే దీని లక్ష్యం. దీనివల్ల మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా తక్కువ ధరలోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది. ఈ రెండు నిర్ణయాల వల్ల కేవలం ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు… సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్లు పెరుగుతాయి, పైరసీ కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలను పిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలు ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nandini Reddy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..

OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే

Follow Us