వెయ్యి కోట్ల కల.. ఈ ఏడాదైనా తీరుతుందా..?
భారతీయ సినిమాకు తొలి వెయ్యి కోట్ల విజయాలను అందించిన టాలీవుడ్‌కు ఈ ఏడాది కూడా ఆ మార్క్ అందుకోవడం సవాలుగా మారింది. ప్రస్తుతం ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పైనే భారీ ఆశలు నెలకొన్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ ‘రామాయణ’, కన్నడ స్టార్ యష్ ‘టాక్సిక్’ కూడా వెయ్యి కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా పెట్టుకుని రేసులో నిలుస్తున్నాయి.
ఇండియన్ సినిమాకు వెయ్యికోట్ల మార్క్‌ను పరిచయం చేసింది టాలీవుడే. అలాంటి టాలీవుడ్‌లో వెయ్యికోట్ల మార్క్‌ను టచ్ చేసే సినిమాలు కరువవుతున్నాయి. గత ఏడాది స్టార్ హీరోలు బ్రేక్ ఇవ్వటంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ వినిపించలేదు. మరి ఈ ఏడాదైనా.. టాలీవుడ్ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో సత్తా చాటుతుందా.? అసలు ఆ ఛాన్స్ ఉన్న సినిమాలేంటి..? భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ మూవీ రన్ ఆల్మోస్ట్ ఆగిపోయింది. కలెక్షన్స్ పరంగా సాలిడ్ గానే నిలబడినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా టాలీవుడ్‌లో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే సినిమా కనిపించలేదు. స్టార్ హీరోలంతా బ్రేక్ తీసుకోవటంతో లాస్ట్ ఇయర్ ఆ కల నెరవేరలేదు. ఈ ఏడాది స్టార్ హీరోలు బరిలో దిగినా ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేయలేకపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ లిస్ట్‌లో కేవలం ఒక్క ఫౌజీ తప్ప ఆ రేంజ్ మూవీ మరోటి కనిపించటం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాపైనే అందరి ఆశలు ఉన్నాయి. కానీ, ఈ సినిమా కూడా అసలు ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే మారింది. ప్రజెంట్ స్పిరిట్ షూట్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, త్వరలో బ్రేక్ తీసుకోబోతున్నారు. ఆ తరువాత తిరిగి ఫౌజీ సెట్‌లో అడుగుపెడతారు. డిసెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న ఫౌజీ టీమ్, డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తోంది. కానీ ప్రభాస్ ఎంత వరకు డేట్స్ ఇస్తారన్నది చూడాలి. మన టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే, పక్క ఇండస్ట్రీలైన బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో మాత్రం బాక్సాఫీస్ దద్దరిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘రామాయణ’ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు ఈజీగా సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక కన్నడలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా అదే రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాది టాలీవుడ్‌కు ఛాన్స్ మిస్సైనా, బాలీవుడ్, కన్నడ సినిమాలు మాత్రం వెయ్యి కోట్ల వసూళ్లతో ఆ లోటును తీర్చేలా కనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!