Buchi Babu: జాన్వీని రోల్ పై విర్శలు.. వివరణ ఇచ్చిన బుచ్చి
‘పెద్ది’ సినిమా భారీ విజయంతో దూసుకుపోతుండగా, జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె గ్లామర్ సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రతికూల స్పందనపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. రామ్ చరణ్, జాన్వీ మధ్య సరదా ప్రేమకథను చూపించాలనుకున్నామని, కానీ కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో పనిచేయలేదని అంగీకరించారు. భవిష్యత్తులో మహిళా పాత్రల రూపకల్పనలో ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు.
ఎన్నో నెలలుగా పెద్ది కోసం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు పెద్దిని సిల్వర్ స్క్రీన్ పై విట్‌నెస్ చేసి ఊగిపోతున్నారు. పెద్ది మ్యానియాతో థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా… పెద్దిగాడి ఆట చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చరణ్ పర్మార్మెన్స్ ఇచ్చే మత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెద్ది సినిమాలో జాన్వీ గ్లామర్ కాస్త ఓవర్ డోస్ అయిందని కామెంట్ చేస్తున్నారు. బుచ్చి తీరును విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు జాన్వీ సీన్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘పెద్ది’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అనుకున్న విధంగా పండలేదని తన రీసెంట్ మీడియా గ్యాదరింగ్ లో బుచ్చిబాబు అంగీకరించాడు. జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై.. కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు ఆయన. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య ఒక సరదా ప్రేమకథను చూపించాలన్నది తన ఉద్దేశమని.. అయితే అది కొంత మందికి నచ్చలేదని చెప్పుకొచ్చాడు. జాన్వీ గ్లామర్ సీన్స్‌ను.. ఆడియన్స్ అంత ప్రతికూలంగా స్వీకరిస్తారని తాను ఊహించలేదన్నాడు బుచ్చిబాబు. భవిష్యత్తులో లేడీ క్యారెక్టర్స్ తీర్చిదిద్దే విధానంలో ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటా అన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హస్కీ వాయిస్‌తో తియ్యగా మాట్లాడి.. కోట్లలో ముంచేసిందిగా
హీరోయిన్ కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ వారసురాలు రాఘవి
