Bigg Boss Nikhil: నిఖిల్ న్యూ లగ్జరీ హౌస్..! మామూలుగా లేదుగా..
బిగ్ బాస్ తెలుగు విజేత, బుల్లితెర స్టార్ నిఖిల్ మలియక్కళ్ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. పలు సూపర్ హిట్ సీరియల్స్, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న నిఖిల్, తన కొత్త ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఆయన కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిఖిల్ మలియక్కళ్ కూడా ఒకడు. అంతకు ముందు పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆక్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు కూడా గెల్చుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్స్ ను కాదని బిగ్ బాస్ టైటిల్ ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ఒక గుడ్ న్యూస్‌ను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. సొంత ఇంటి కల నెరవేరిందన్న శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. గృహ ప్రవేశం కార్యక్రమంలో నిఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులందరూ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు నిఖిల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక టీవీ షోస్, వెబ్ సిరీస్ ల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచాడు నిఖిల్. ‘గోరింటాకు’ సీరియల్‌లో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతోనే అతను ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చాలా సార్లు జంటగానే కనిపించారు నిఖిల్, కావ్య. పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి విడిపోయారు. బిగ్‌బాస్ షోలోకి వచ్చేముందే నిఖిల్, కావ్య విడిపోయారు. ఇప్పుడు ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటున్నాడు. కావ్య కూడా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బుల్లితెరపై బిజీగా ఉంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
