Swetha Varma: అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో శ్వేత వర్మ ఒకరు. తెలుగులో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ కనిపించింది. కానీ నటిగా కాకుండా బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ షోలో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది.
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో శ్వేత వర్మ ఒకరు. తెలుగులో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ కనిపించింది. కానీ నటిగా కాకుండా బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ షోలో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది. ఇక కొన్నాళ్లుగా అటు సినిమాలకు కూడా దూరంగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్వేత.ఈ క్రమంలోనే ఇటీవల ఆమె చేసిన ఓ పోస్టుకు ఓ వ్యక్తి అసభ్యకరమైన మెసేజులు చేశాడు. దీంతో చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది శ్వేత. అసభ్యంగా కామెంట్ చేసిన సదరు వ్యక్తి ప్రోఫైల్ ఐడీ కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని స్క్రీన్ షాట్స్ చేసింది శ్వేత. అందులో ఓ వ్యక్తి శ్వేత ఫోటోకు అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో శ్వేత రియాక్ట్ అవుతూ.. ఒక మనిషికి ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది ?.. అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలాగే చెబితే పర్వాలేదు అనుకుంటాడా ? అంటూ రాసుకొచ్చింది. అలాగే అతడి వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఇలాంటి వాళ్లను చూస్తే సిగ్గేస్తుందని.. అలాగే తనకున్న సోర్స్ ద్వారా అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని తెలిపింది. అతడిది రియల్ అకౌంటా ? ఫేక్ అకౌంటా ? అని ఆలోచన అక్కర్లేదని.. అది ఏదైనా తెచ్చిపెట్టే సోర్స్ తనకుందని తెలిపింది. అతడి అడ్రస్ కూడా పోస్ట్ చేయగలని.. కానీ మనిషిని కాబట్టి చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. అతడు ఒక గుణపాఠం నేర్చుకుంటే మంచిది .. ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకొచ్చింది. మరోసారి అతడి కామెంట్ పై రియాక్ట్ అవుతూ ఓ వీడియోను షేర్ చేసింది. శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!