దివ్వెల మాధురిపై రీతూ తల్లి సెటైర్లు.. అబద్దాలు ఆడితే ఇలానే ఉంటది

Updated on: Dec 10, 2025 | 11:48 AM

బిగ్ బాస్ తెలుగు 9 నుండి రీతూ చౌదరి ఎలిమినేషన్ తరువాత ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి అబద్ధాలు చెప్పిందని, రీతూ-డిమాన్ రిలేషన్ గురించి ఫోన్ చేసి ఎవరికీ చెప్పలేదని ఖండించారు. అంతేగాక, మాధురి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేస్తూ ఆమె పరువు తీసారు.

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షో ఇప్పటివరకు 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ పడనుంది. ఇక డిసెంబర్ 07 ఎపిసోడ్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. టాప్ కంటెస్టెంట్ గా టాప్-5లో ఉంటుందనుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టింది రీతు. ఈ సందర్భంగా తన బిగ బాస్ ప్రయాణం, డిమాన్ పవన్ తో రిలేషన్ షిప్ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన రీతూ.. ప్రెస్ మీట్ పెట్టి అందరితో మాట్లాడింది. ఈక్రమంలోనే రీతూ తల్లికి ఓ రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. “రీతూ, డిమోన్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న దివ్వెల మాధురి కి మీరు ఫోన్ చేసి చెప్పారా? అంటూ ఓ రిపోర్టర్ రీతూ తల్లిని నేరుగా అడిగాడు. దీంతో.. రీతూ తల్లి… మాధురి అన్నీ అబద్దాలు చెప్పిందని.. తాను ఎవరికీ ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువు తీసేసింది రీతూ చౌదరి తల్లి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో ఇద్దరికి కస్టడీ

Priyanka Gandhi: సోనియాకు నోటీసులపై ప్రియాంక గాంధీ రియాక్ష

రోడ్లపై కూరగాయల వ్యాపారంపై కమిషనర్ ఆగ్రహం

అధిక రిటర్న్స్ ఆశజూపి డాక్టర్ దంపతుల నుంచి రూ.3కోట్లు స్వాహా

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన తైవాన్ గ్రూప్ ప్రతినిధులు