కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Updated on: Feb 01, 2026 | 4:50 PM

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్, విజయ్ కార్తీక్ బ్రేకప్ వివాదం కొత్త మలుపు తిరిగింది. డబ్బు లేదనే కారణంగా కీర్తి విడిచిపెట్టిందని విజయ్ కార్తీక్ వీడియోలో ఆరోపించడంతో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై కీర్తి భట్ స్పందిస్తూ, తనను తప్పు పట్టొద్దని, తనపై తప్పుడు ప్రచారాలు బాధపెడుతున్నాయని తెలిపింది. నిందలు వేస్తున్న వారి పేర్లు రాసిపెట్టుకున్నానని, తన జీవితంలో ఏదైనా జరిగితే వారే బాధ్యులని హెచ్చరించింది.

బిగ్ బాస్ ఫేమ్‌ కీర్తి భట్ బ్రేకప్ కాస్తా.. ఆమె ప్రియుడు విజయ్‌ కార్తీక్ వీడియో స్టేట్మెంట్‌తో కొత్త టర్న్‌ తీసుకుంది. డబ్బు లేదనే కారణంతోనే కీర్తి తనను విడిచిపెట్టినట్టు విజయ్ కార్తీక్ తను షేర్ చేసిన వీడియోలో చెప్పడంతో.. ఇప్పుడు నెటిజన్లు అందరూ కీర్తిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రేమించిన వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్‌ కాదని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్‌ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్‌ అనుకుని తనను తప్పు పట్టడం సరి కాదంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాదు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో తనపై లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏవేదో ప్రచారం చేస్తున్నారని.. అది తనను మరింత బాధపెడుతోందంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. నిజంగా తన వల్ల కావడం లేదని.. ఎవరైతే తనపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసిపెట్టుకున్నానని.. తన జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులంటూ తన పోస్టులో కోట్ చేసింది కీర్తి భట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??