హీరోలను డామినేట్ చేస్తున్న విలన్లు

Updated on: Sep 07, 2026 | 4:22 PM

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల తీరు మారుతోంది. గతంలో హీరోల ముందు బలహీనంగా కనిపించిన విలన్లు ఇప్పుడు వారికి దీటైన విధంగా సవాల్ విసురుతున్నారు. రాజమౌళి వంటి దర్శకుల ప్రభావంతో, ప్రతినాయకుల పాత్రలు కీలకమవుతున్నాయి. కమల్ హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి నటులు శక్తివంతమైన విలన్లుగా తెరపై అలరిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సినిమాలో హీరో అంటేనే ఆధిపత్యం, విలన్ అంటే బలహీనత అనే పాత ఫార్మాట్ గతానికి చెందింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలకు ఏమాత్రం తీసిపోని, బలమైన విలన్‌ల పాత్రలు ట్రెండ్‌గా మారాయి. మేకర్స్ విలన్ల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాజమౌళి వంటి దర్శకులు విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే హీరో అంతకుమించి పవర్‌ఫుల్ అవుతాడు అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. చాలా మంది ఇతర దర్శకులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.ప్యారడైజ్ చిత్రంలో నాని నటనకు దీటుగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ విక్రమ్ మాలిక్‌గా నటిస్తున్నారు. అలాగే, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే వారణాసి చిత్రంలో హీరోకు ధీటుగా పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విశ్వరూపం చూపనున్నారు. ఈ మలయాళ స్టార్ ప్రభాస్‌తో సలార్ 2లోనూ దీటైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలలోనూ ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది.విలన్ల ప్రస్తావన వస్తే, కల్కి 2898 ADలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించడం విశేషం. ఈ చిత్రంలో కొన్ని నిమిషాల పాత్రే అయినా దాని ప్రభావం చాలా బలంగా ఉంది. కల్కి 2లో ఎస్కిన్‌గా కమల్ హాసన్ పూర్తి స్థాయి విశ్వరూపం చూపిస్తారని అంచనా. మొత్తానికి, మన సినీ నిర్మాతలు విలన్లను హీరో స్థాయిలోనే చూపించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us