పబ్లిసిటీ కోసం పరాయి రాష్ట్రంలో హీరోలు
ఒకప్పుడు తెలుగు సినిమా ఈవెంట్స్ హైదరాబాద్‌కే పరిమితం. కానీ పాన్ ఇండియా ట్రెండ్‌తో మన హీరోల మార్కెట్ విస్తరించింది. ఉత్తరాది మార్కెట్‌పై దృష్టి సారించి, నిర్మాతలు తమ చిత్రాల ప్రమోషన్స్ అక్కడే నిర్వహిస్తున్నారు. 'పుష్ప 2' పాట్నా ఈవెంట్, 'అఖండ 2' ముంబై సాంగ్ లాంచ్, 'ఆదిపురుష్' అయోధ్య టీజర్ లాంచ్, రామ్ చరణ్ 'పెద్ది' భూపాల్ ఈవెంట్ ఈ వ్యూహంలో భాగమే. ఇది బాక్సాఫీస్ విజయానికి దోహదపడుతుంది.
ఒకప్పుడు సినిమా ఈవెంట్ అంటే కేరాఫ్ హైదరాబాద్.. లేదంటే ఏపీ. కానీ ఇప్పుడలా కాదు.. మన హీరోల మార్కెట్ పెరుగుతుంది. నిర్మాతల ఆలోచనలు మారుతున్నాయి. ఆ లెక్కలేసుకుని ఇక్కడ చేయాల్సిన ఈవెంట్స్‌ను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తాజాగా మరో హీరో సైతం తన ఫంక్షన్ భూపాల్‌లో అంటున్నారు. మరి దీని వెనక కథేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. ప్యాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత.. మన హీరోల ఫోకస్ అంతా నార్త్ మార్కెట్‌పై ఉంది. మన దగ్గర ఎలాగూ ఇమేజ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ వస్తాయి.. అందుకే పక్క ఇండస్ట్రీల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. అందుకే తమ సినిమాల మేజర్ ఈవెంట్స్ అన్నీ నార్త్‌లోనే ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో గ్రాండ్ సక్సెస్ అయింది. పుష్ప తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా క్లిక్ అయింది. అందుకే సీక్వెల్ మార్కెట్ మరింత పెంచడానికి అప్పట్లో పాట్నాలో ఈవెంట్ చేసారు. అది సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఎంతగా అంటే నార్త్‌లో ఏ ఒక్క రికార్డ్‌ను కూడా వదలకుండా వేటాడాడు పుష్ప రాజ్. అఖండ 2 సాంగ్ లాంఛ్ ఈవెంట్ సైతం ముంబైలో గ్రాండ్‌గా చేసారు. అఖండ 2 కోసం ఫస్ట్ ఈవెంట్ ముంబై నుంచే స్టార్ట్ చేసారు. తమకు ఇక్కడ్నుంచే దీవెనలు కావాలన్నారు బాలయ్య. ఆదిపురుష్ టీజర్ లాంఛ్ ఈవెంట్ అప్పట్లో ఓ సంచలనం. అయోధ్యకు వెళ్లి.. అక్కడే టీజర్ విడుదల చేసి హైప్ అమాంతం పెంచేసారు టీం. రామ్ మందిర్ కట్టిన కొత్తలో చేసిన ఈ ఈవెంట్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా భూపాల్‌లో ప్లాన్ చేస్తున్నారు. చికిరీ చికిరీతో హిందీ ఆడియన్స్‌లోకి పెద్ది బాగా వెళ్లింది. ఇదే మూమెంట్‌లో నార్త్‌లో ట్రైలర్ ఈవెంట్ భారీగా చేస్తే మరింత హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే ఓవర్సీస్‌లో బుకింగ్స్ రికార్డు స్థాయిలో వస్తున్నాయి. నార్త్‌లోనూ కుమ్మేస్తే పెద్దికి బాక్సాఫీస్ దగ్గర తిరుగుండకపోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: గుడ్ న్యూస్.. NTR ఫ్యాన్స్‌కు పెద్ది స్వీట్ సర్‌ప్రైజ్ | పెద్ది కోసం రంగంలోకి ధోని
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Siri Hanumanth: ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!