ఫ్యాక్షన్‌కు గుడ్‌బై.. కొత్త కథల రాజధానిగా మారుతున్న రాయలసీమ!

Edited By:

Updated on: Jul 13, 2026 | 6:21 PM

ఒకప్పుడు ఫ్యాక్షన్ కథలకే పరిమితమైన రాయలసీమ ఇప్పుడు విభిన్న కథలకు వేదికగా మారుతోంది. అనిల్ రావిపూడి మల్టీస్టారర్, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, అఖిల్ ‘లెనిన్’ వంటి చిత్రాలు సీమ సంస్కృతి, చరిత్ర, భావోద్వేగాలను కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాయి. ప్రతీకార కథలకు భిన్నంగా ప్రాంతీయతను బలమైన కథనంగా మలుస్తూ టాలీవుడ్ దర్శకులు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.

ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన రాయలసీమ నేపథ్యం ఇప్పుడు విలక్షణమైన కథలకు వేదికగా మారుతుందా..? టాలీవుడ్ మేకర్స్ సీమ బ్యాక్‌డ్రాప్ కథలపైనే ఆసక్తి చూపిస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి..? పాత కాలపు పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి సరికొత్త కథనాలతో వస్తున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి..?వెంకటేష్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సీమ నేపథ్యంలోనే వస్తుంది. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ అని రక్తం చిందించి మరీ దర్శకుడు చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఈ విభిన్నమైన కాంబినేషన్‌లో వస్తున్న సీమ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రణబాలి సినిమా కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందుతోంది. 18వ శతాబ్దం నాటి కథతో 1854 నుంచి 1878 సంవత్సరాల మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ సైతం రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో కథ కంటే కథనం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు మురళీ కిషోర్ అబ్బూరు. మొత్తానికి రాయలసీమ విభిన్నమైన కథలకు నెలవుగా మారిందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us