నటిని కిడ్నాప్ చేసిన ఆమె భర్త !! కట్ చేస్తే ??

Updated on: Dec 18, 2025 | 4:49 PM

బెంగళూరులో సీరియల్‌ నటి చిత్ర కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. మాజీ భర్త హర్షవర్ధనే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తన కుమార్తె కోసం చిత్రను కిడ్నాప్ చేసి, బంధువులను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. చిత్ర కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరులో సీరియల్‌ నటి కిడ్నాప్ కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే, నటి చిత్రను ఆమె భర్తే కిడ్నాప్ చేశారు. నిర్మాత అయిన ఆమె భర్త హర్షవర్ధన్, తన సహచరుల సహాయంతో కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి కుటుంబం. కూతురి కోసమే ఈ కిడ్నాప్ చేశాడని ఆరోపించింది. ఆమె సోదరి లీలా ఫిర్యాదు ప్రకారం.. నటి చిత్ర, ఆమె భర్త హర్షవర్ధన్ గత ఏడెనిమిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. హర్షవర్ధన్ హాసన్‌లోనూ.. చిత్ర తన ఏడాది పాపతో కలిసి మగడి రోడ్డులోని అద్దె ఇంట్లో ఉంటోంది. వీరిద్దరికి 2023లో వివాహం కాగా.. ఓ పాప ఉంది. భర్త నుంచి విడిపోయిన చిత్ర సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. డిసెంబర్ 7న షూటింగ్ కోసం మైసూరు వెళ్తున్నట్టు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే, ఇది, ఆమె మాజీ భర్త ప్లాన్‌లో భాగమని తెలుస్తోంది. హర్షవర్ధన్ తన సహచరుడు కౌశిక్‌కు రూ. 20,000 అడ్వాన్స్‌గా ఇచ్చాడని, అతడు మరో వ్యక్తి సహాయంతో చిత్రను ఉదయం 8 గంటలకు మైసూరు రోడ్ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లాడనేది ఆరోపణ. అక్కడి నుంచి ఆమెను కారులో బలవంతంగా NICE రోడ్, బిడది మార్గంలో తీసుకెళ్లారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు చిత్ర తన స్నేహితుడు గిరీష్‌ను అప్రమత్తం చేసిందని సమాచారం. గిరీష్ వెంటనే చిత్ర కుటుంబానికి కిడ్నాప్ సమాచారం ఇచ్చాడు. ఆ సాయంత్రం చిత్ర తల్లి సిద్ధమ్మకు హర్షవర్దన్ ఫోన్ చేసి, కిడ్నాప్‌ చేసినట్టు తెలిపాడు. ఆమెను వదిలిపెట్టాలంటే తన షరతుకు అంగీకరించాలని బెదిరించినట్టు ఫిర్యాదులో ఉంది. ‘‘పాపను తాను చెప్పిన చోటికి తీసుకురాకపోతే, చిత్రను వదిలిపెట్టను’’ అని బెదిరించాడని తెలిపారు. తర్వాత మరొకరికి ఫోన్ చేసి, తన కుమార్తెను అర్సికెరెకు తీసుకురావాలని, అప్పుడు చిత్రను సురక్షితంగా వదిలిపెడతానని చెప్పాడని తెలిసింది. మొదట టిప్పుటూరు, బెంగళూరులోను వెదికిన కుటుంబసభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు హర్షవర్ధన్.. వర్దన్ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని.. సినిమా నిర్మాత కూడా. చిత్ర సోదరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Emanuel: ఇమ్మాన్యుయేల్ గెలవడం కష్టమేనా ??

కొత్త సినిమా ప్ర‌క‌టించిన కొద్ది రోజుల‌కే..దర్శకుడి కొడుకు లిఫ్ట్‌ ప్రమాదంలో మృతి

Varanasi: వారణాసి సినిమాలో మరో స్టార్! జక్కన్న వేరే లెవెల్ ప్లాన్

Kalvakuntla Kavitha: రామ్‌ చరణ్ గొప్ప వ్యక్తే కానీ..నా ఫేవరెట్ మాత్రం ఆ హీరోనే! వైరల్ అవుతున్న కవిత కామెంట్స్

Balakrishna: మరోసారి గొంతు సవరించుకుంటున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ