Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..

Updated on: Feb 25, 2026 | 12:00 PM

ప్రముఖ నటుడు బాబు మోహన్ తన జీవితంలోని షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనపై విష ప్రయోగం జరిగిందని, దైవ సంకల్పంతో ప్రాణాపాయం నుండి బయటపడి పాన్ అలవాటును మానేశానని తెలిపారు. రాజకీయాల్లో నిష్క్రియాత్మకంగా ఉండటానికి గల కారణాలు, సినీ ప్రస్థానం, ప్రస్తుత ఆరోగ్య వివరాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన అనుభవాలు పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి.

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తన జీవితంలోని అనూహ్య సంఘటనలను, సినిమా విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆయన, గత కొద్ది నెలలుగా రాజకీయంగా అంత చురుకుగా కనిపించకపోవడానికి గల కారణాలను, తన నటన ప్రయాణంలోని జ్ఞాపకాలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని వివరించారు. ఈ క్రమంలోనే తనపై విష ప్రయోగం జరిగిందని.. దేవుడి దయ వల్ల తప్పించుకున్నా అంటూ ఆనాటి షాకింగ్ విషయాన్ని వివరించారు బాబు మోహన్. రోజుకు 30-35 కాశ్మీర్ ఖిమాం జర్దా పాన్‌లను తినే అలవాటున్న తనకు ఉందని చెప్పిన బాబు మోహన్.. ఒకసారి సంగారెడ్డిలోని తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వస్తుండగా, ఓ పాన్ షాపులో పాన్ కట్టించుకున్నా అన్నారు. మెయిన్ రోడ్డు ఎక్కిన తర్వాత పాన్ వేసుకుందామని చూస్తుండగా.. ఉన్నట్టుండి ఎస్పీ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ ఎస్పీ ‘మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా? అని అడగగా.. తాను అవునని బదులిచ్చానని చెప్పారు. వెంటనే సదరు ఎస్పీ, ఆ పాన్ తినకండి.. అందులో విషయం కలిపారంటూ తనను హెచ్చరించినట్టు చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మరొక మహిళ ఏడుస్తూ ‘సాబ్ పాన్ నై ఖానా, ఉస్ మే జెహెర్ హై’ అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. దాంతో వెంటనే తాను ఆ పాన్ తినకుండా పడేశానంటూ.. అప్పటి విషయం గురించి వివరించారు బాబు మోహన్. ప్రత్యర్థులు తనను చంపేందుకు తన పాన్‌లో విషం కలిపినట్టు చెప్పుకొచ్చారు. భగవంతుడి దయ వల్లే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని, ఆ సంఘటన తర్వాత పాన్ తినడం పూర్తిగా మానేశానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. దైవ సంకల్పం తన ప్రాణాన్ని కాపాడిందని, అదే సమయంలో తనకు పాన్ అలవాటు మానేసేలా చేసిందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Niharika Konidela: ఫిలిం ఫేర్ నిర్వాహకులపై నిహారిక ఫైర్..

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

రమ్యకృష్ణ కొడుకు ఫిల్మ్ ఎంట్రీ ?? తండ్రి ఏమన్నారంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us