అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ సినిమాలో 'నేయ్‌తిరి' పాత్ర రూపకల్పనపై పెద్ద వివాదం. తన ముఖ కవళికలను అనుమతి లేకుండా వాడి పాత్రను సృష్టించారని నటి క్వోరియంక కిల్చర్, జేమ్స్ కామెరాన్, వాల్ట్ డిస్నీలపై దావా వేసింది. దీనికి కామెరాన్ గతంలో చేసిన వ్యాఖ్యలే ఆధారంగా మారాయి. భారీ పరిహారం, లాభాల్లో వాటా కోరుతున్న కిల్చర్ కేసు, హాలీవుడ్‌లో డిజిటల్ రూపం హక్కుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.
‘అవతార్’…వరల్డ్ సినిమాపై దీని ఇంపాక్ట్ అంటా ఇంతా కాదు. అవతార్ నుంచి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వరకు ఈ ఫ్రాంచైస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీనే కొల్లగొట్టింది. పదేళ్లు తర్వాత ఇప్పుడు ఈ సినిమా కాంట్రవర్సీ లో ఇరుక్కుంది. సినిమాలో బ్లూ రంగులో మెరిసె వీరనారి ‘నేయ్‌తిరి’ క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో పెద్ద మోసం జరిగిందంటూ ఓ నటి కోర్టుకెక్కడం ఇప్పుడు రల్ అవుతుంది. ప్రముఖ నటి క్వోరియన్కా కిల్చర్, దర్శకుడు జేమ్స్ కామెరాన్, వాల్ట్ డిస్నీ సంస్థలపై సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ కోర్టులో దావా వేసింది. తన పర్మిషన్ లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన ముఖ కవళికలను వాడి ‘నేయ్‌తిరి’ పాత్రను క్రియేట్ చేశారన్నది ఆమె ఆర్గ్యుమెంట్.మాములుగా సినిమాల్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి నటుల ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తారు. కానీ ఇక్కడ కిల్చర్ ప్రమేయం లేకుండానే ఆమె పోలికలను వాడేశారనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ కాంట్రవర్సీ 2005లో మొదలైంది. 14 ఏళ్ల వయసులో కిల్చర్ ఓ చిత్రంలో కిల్చర్ నటించింది. ఎల్ఏ టైమ్స్ పత్రికలో ఆమె ఫొటో ప్రచురితమైంది. ఆ ఫోటోను చూసిన జేమ్స్ కామెరాన్, దానికి ముగ్ధుడైపోయారట. తన డిజైన్ టీమ్‌ని పిలిచి, ఆ ఫోటోను రెఫరెన్స్‌గా ఇచ్చి “నేయ్‌తిరి ముఖం ఇలాగే ఉండాలి” అని ఆర్డర్ వేశారనీ. తన ముఖాన్ని, తన గుర్తింపును ఒక కమర్షియల్ ప్రొడక్ట్ కోసం వాడుకుని, తనకు కనీసం క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు ఉండవు. కానీ ఇక్కడ స్వయంగా జేమ్స్ కామెరాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ రచ్చకి దారి తీశాయ్.గతంలో ఒక ఈవెంట్‌లో కిల్చర్‌ను కలిసినప్పుడు, నేయ్‌తిరి పాత్రకు ఆమే స్ఫూర్తి అని చెబుతూ ఒక స్కెచ్‌పై కామెరాన్ సంతకం చేసి ఇచ్చారు. అలాగే ఒక ఇంటర్వ్యూలో కామెరాన్ మాట్లాడుతూ.. “నేయ్‌తిరి పాత్రకు మూలం క్వోరియన్కా కిల్చర్ ఫోటోనే. ఆమె ముఖంలోని కింది భాగం చాలా ఆసక్తికరంగా ఉంటుంది” అని ఓపెన్ గా చెప్పిన మాటలనే కిల్చర్ తన ఆయుధాలుగా మార్చుకుంది. అవతార్ సినిమా గిరిజన తెగల హక్కుల గురించి పోరాటం చేసే కథతో వచ్చింది. కానీ నిజ జీవితంలో ఒక స్థానిక తెగకు చెందిన అమ్మాయి హక్కులనే కాలరాశారని కిల్చర్ తరపు న్యాయవాదుల వాదన. ఆమెకు భారీ మొత్తంలో పరిహారంతో పాటు, ‘అవతార్’ సిరీస్ కి వచ్చిన వేల కోట్ల లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసారు. దీంతో సినిమాలో గ్రాఫిక్స్ అనుకున్నవన్నీ నిజం కాదా ? ఒక మనిషి పోలికలను కాపీ కొట్టి వేల కోట్లు గడించడం కరెక్టేనా? అన్న డిస్కషన్ ఇప్పుడు నెట్టింట్లో గట్టిగానే జరుగుతోంది. ఒకవేళ కోర్టు కిల్చర్ వైపు తీర్పు ఇస్తే, అది హాలీవుడ్ ఫ్యూచర్ పై సాలిడ్ ఇంపాక్ట్ నే చూపిస్తుంది. ఇప్పటికే AI డిజిటల్ రిప్లికాస్ పై నటులు సమ్మెలు చేస్తున్న ఈ సమయంలో ఈ ‘అవతార్’ కాంట్రవర్సీ మరింత పాపులర్ అయిపోతుంది.చూడాలి మరి కోర్టు ఎవరికీ అనుకూలంగా తీర్పు ఇస్తుందో !
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Siri Hanumanth: ఇన్‌స్టా సబ్ స్క్రిప్షన్ మొదలెట్టిన సిరి.. అప్పుడే లక్షల్లో సంపాదన!
Peddi: బాబాయ్ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్
Trisha: విజయ్ మౌనం నాకు నచ్చదు..!
త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి