Avantika: మరోసారి ట్రెండింగ్‌లోకి అవంతిక

Updated on: Aug 17, 2026 | 7:04 PM

అవంతిక వందనపు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బాలనటి, ప్రస్తుతం హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తోంది. స్పిన్, మీన్ గర్ల్స్ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఇటీవలే తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో మెరిసి, హాలీవుడ్ ఈవెంట్లలోనూ గ్లామరస్‌గా కనిపించి, మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ ప్రాజెక్ట్‌లపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు అవంతిక వందనపు. తెలుగుతో పాటు హాలీవుడ్‌లోనూ ఆసక్తికరమైన చిత్రాలలో నటించిన ఈ నటి, సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇటీవల ఒక తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ, ప్రస్తుతం మరో ఆసక్తికరమైన అంశంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా నటించిన అవంతిక, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లో హాట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. దాదాపు పది తెలుగు సినిమాల్లో బాలనటిగా నటించిన అవంతిక 2021లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టీనేజ్‌లోనే హాలీవుడ్ మూవీలో ప్రధాన పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇండో-అమెరికన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన స్పిన్ సినిమా అవంతికకు హాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అక్కడ కూడా మంచి అవకాశాలు వచ్చాయి. మీన్ గర్ల్స్ సినిమాలో అవంతిక హాట్ లుక్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. తెలుగులో బాలనటిగా చేసిన అమ్మాయి హాలీవుడ్‌లో అలాంటి పాత్ర చేయడంపై గట్టిగానే చర్చ జరిగింది. మీన్ గర్ల్స్ తర్వాత పెద్దగా మీడియాకు కనిపించని అవంతిక మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఛాంపియన్ సినిమా కోసం ఒక రెట్రో సాంగ్ లో ఆడి పాడారు. హాలీవుడ్‌లో జరిగిన పవర్ ఆఫ్ యంగ్ హాలీవుడ్ ఇంపాక్ట్ ఈవెంట్స్లో గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని టీవీ సిరీస్‌లు చేస్తున్న అవంతిక ప్రధానంగా హాలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!

రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం

హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇక ఇడ్లీ-సాంబార్‌..

అంగారకుడిపై నీళ్లే కాదు.. రత్నాలు కూడా.. బయటపడ్డ రహస్యం..

Loading...
Unable to load recommendations.
Follow Us