60 ఏళ్ల వయసులో పెళ్లి.. విడాలకుల లొల్లి! బాధనంతా బయటపెట్టిన నటుడు
నటుడు అశిష్ విద్యార్థి తన విడాకులు, రెండో పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ట్రోల్స్‌పై తాజాగా స్పందించారు. 24 ఏళ్ల వైవాహిక బంధం ముగిసినప్పుడు జీవితం మొత్తం నాశనమైనట్లు అనిపించిందని భావోద్వేగంగా వెల్లడించారు. 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను వివాహం చేసుకున్న తర్వాత పలువురు విమర్శలు చేశారని గుర్తుచేసుకున్నారు. ఇతరుల మాటలు తనను మానసికంగా ప్రభావితం చేశాయని, వాటిని ఎదుర్కోవడం అంత సులభం కాలేదని తెలిపారు.
టాలీవుడ్లో ప్రతి నాయకుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు అశిష్ విద్యార్థి. సినిమాలే కాకుండా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ చూస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యే ఈయన.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తన 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్న ఈయన ఓ ఏడాది క్రితం సెన్సేషనల్ అయ్యారు. 60 ఏళ్ల వయసులో తనకంటే చాలా చిన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారంటూ కొంత మంది చేసిన దారుణ విమర్శలను తట్టుకుని నిలబడ్డారు. ఈక్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈయన.. తన పెళ్లి – డైవోర్స్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రెండో పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి కూడా ఈయన నోరువిప్పారు.తన జీవితంలో ఎదురైన ఈ క్లిష్టమైన పరిస్థితితోపాటు ఆ బాధ నుంచి తాను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని ఆశిష్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు. అశిష్ మొదటి వివాహం నటి, గాయని రాజోషితో జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే దాదాపు 24 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. దీంతో చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్న అశిష్ విద్యార్థి.. 2023లో.. తన 60 ఏట.. మళ్లీ వివాహం చేసుకున్నారు. 24 ఏళ్ల తర్వాత తన వివాహ బంధం ముక్కలైనప్పుడు చాలా కష్టంగా అనిపించిందని.. అప్పటికి తన వయస్సు దాదాపు 55 సంవత్సరాలని.. అంతా నాశనమైపోయినట్లు అనిపించిందంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్లే తన బంధం ముగిసిందని.. . దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదని చెప్పిన ఈయన.. ఇలా జరుగుతుందని తానైతే అనుకోలేదంటూ భారంగా చెప్పుకొచ్చారు. తాను ఒక మోటివేషనల్ స్పీకర్, నటుడినని.. కానీ తన రెండో పెళ్లి గురించి ప్రజలు ఏమన్నారో, దానిని ఎలా ఎదుర్కొన్నానో తనకు తెలుసంటూ అశిష్ చెప్పుకొచ్చారు. ప్రజలు నిరసన తెలిపినప్పుడు, వారికి పరిస్థితి అర్థం కాదు. ఒక్క వ్యక్తి కాదు, అందరూ వెలెత్తి చూపుతారు. ప్రజలు నాతో, ‘ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సహజీవనం ఎందుకు చేయకూడదు?’ అని అనేవారు. కొంతమంది నా కెరీర్ ముగిసిపోయిందని , నేను నిశ్శబ్దంగా కూర్చుని నా కొడుకు పెరగడాన్ని చూడాలని అన్నారు. అయితే వాళ్ల మాటలు వింటూ కూర్చునే బదులు.. ఇవన్నీ మాట్లాడటం ఆపమని తాను అప్పుడే సమాధానం చెప్పాల్సింది. కానీ చెప్పలేకపోయా అంటూ అశిష్ ట్రోల్స్ కారణంగా తాను పడిన సంఘర్షణ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామాయణ పార్ట్ 1 రిలీజ్ అయిన వేళ.. బాంబు పేల్చిన ప్రొడ్యూసర్
రాధికాకు.. SKN దిమ్మతిరిగే కౌంటర్
బాలీవుడ్ హీరోకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చూస్తూ ధమ్కీ
బాలు ప్యాంటుకి 2nd వరల్డ్ వార్కి లింకేటో తెలుసా? ఇట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన రేణు దేశాయ్
